బాలీవుడ్ హీరో కొత్త పవర్ ఫుల్ లగ్జరీ ఎస్‌యూ‌వి.. దీని ఫీచర్స్, ఇంజన్ పవర్ అదుర్స్..

Published : Nov 12, 2022, 11:38 PM IST
బాలీవుడ్ హీరో కొత్త పవర్ ఫుల్ లగ్జరీ ఎస్‌యూ‌వి.. దీని ఫీచర్స్, ఇంజన్ పవర్ అదుర్స్..

సారాంశం

ఈ ఎస్‌యూ‌వి ఉన్న హీరోలలో అర్జున్ కపూర్, సన్నీ డియోల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్, రవితేజ ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అంతేకాదు  హీరోలతో పాటు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ఎస్‌యూ‌వి మోడల్ తమిళనాడు సి‌ఎం ఎం‌కే స్టాలిన్ అండ్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే వంటి రాజకీయ నాయకుల  బెస్ట్ ఆప్షన్ కూడా.

బాలీవుడ్ హీరో సునీల్ శెట్టికి  పెద్ద లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. తాజాగా ఈ హీరో ఒక  కొత్త  కార్ పై మనసు పడ్డాడు. ఆ కార్ ఏంటంటే కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, దీనిని కొద్దిరోజుల క్రితం కొనుగోలు చేశాడు. ఈ పవర్ ఫుల్ ఆఫ్-రోడర్ ఎస్‌యూ‌వి  ఎక్స్-షోరూమ్ ధర ముంబైలో రూ. 1.5 కోట్లు. అంతేకాదు ఈ కార్ బాలీవుడ్‌లో బాగా పాపులర్ పొందిన కారు.  

ఈ ఎస్‌యూ‌వి ఉన్న హీరోలలో అర్జున్ కపూర్, సన్నీ డియోల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్, రవితేజ ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అంతేకాదు  హీరోలతో పాటు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ఎస్‌యూ‌వి మోడల్ తమిళనాడు సి‌ఎం ఎం‌కే స్టాలిన్ అండ్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే వంటి రాజకీయ నాయకుల  బెస్ట్ ఆప్షన్ కూడా.

సునీల్ శెట్టి కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ఎస్‌యూ‌వి కారు లాంగ్ వీల్‌బేస్ (LWB) వేరియంట్ అండ్ 5 డోర్‌లతో వస్తుంది.  ఈ వెర్షన్ డిఫెండర్ 90 వెర్షన్ కంటే ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. బాలీవుడ్ హీరో ఈ ఎస్‌యూ‌వి కోసం ఫుజి వైట్‌ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కలర్ స్కీం పథకం కాకుండా ఈ ఆఫ్-రోడర్ ఎస్‌యూ‌వి 11 కలర్స్ లో అందుబాటులో ఉంది. 

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ఎస్‌యూ‌వి ఇండియాలో మూడు ఇంజన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో రెండు పెట్రోల్ అండ్ ఒకటి డీజిల్. రెండు టర్బో పెట్రోల్ ఇంజన్‌  ఆప్షన్స్ లో  ఒకటి 2.0-లీటర్, మరొకటి 4-సిలిండర్ యూనిట్ (300 Bhp-400 Nm) అండ్ 3.0-లీటర్, 6-సిలిండర్ యూనిట్ (400 Bhp-550 Nm). అత్యంత ప్రజాదరణ పొందిన ఇంజిన్ 3.0-లీటర్ ఇన్‌లైన్ 6 టర్బో డీజిల్, ఈ ఇంజన్ 300 Bhp-650 Nm పవర్ విడుదల చేస్తుంది. ఈ ఇంజన్  8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

సునీల్ శెట్టి  ఆన్-స్క్రీన్ ఇమేజ్ అతని నిజ జీవితానికి సరిపోతుంది. హీరో కార్ల కలెక్షన్ కూడా ఆ ఇమేజ్‌ని పోలి ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. సునీల్ శెట్టి Mercedes-Benz GLS 350, Mercedes-Benz G350D, హమ్మర్ H2, జీప్ రాంగ్లర్ అండ్ BMWX5 వంటి చాలా పెద్ద కార్ల కూడా ఉన్నాయి. 
 
PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు