Toyota Hilux: బుకింగ్ లు నిలిపివేసిన టయోటా.. కారణమిదే..?

By team telugu  |  First Published Feb 4, 2022, 3:18 PM IST

జపాన్ వాహన దిగ్గజం టయోటా సంస్థ ఇటీవల భారత్ లో హైలక్స్ పికప్ ట్రక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లైఫ్ స్టైల్ యుటిలిటీ సెగ్మెంట్ లో ప్రీమియం వాహన వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ హైలక్స్ వాహనాన్ని భారత్ లో విడుదల చేసింది టయోటా సంస్థ. 


Toyota Hilux: బుకింగ్ లు నిలిపివేసిన టయోటా.. కారణమిదే..?

జపాన్ వాహన దిగ్గజం టయోటా సంస్థ ఇటీవల భారత్ లో హైలక్స్ పికప్ ట్రక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లైఫ్ స్టైల్ యుటిలిటీ సెగ్మెంట్ లో ప్రీమియం వాహన వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ హైలక్స్ వాహనాన్ని భారత్ లో విడుదల చేసింది టయోటా సంస్థ. జనవరి 20న వాహననాన్ని ఆవిష్కరించగా మూడు రోజుల అనంతరం భారత్ లో హైలక్స్ బుకింగ్ లు ప్రారంభించింది టయోటా సంస్థ. అయితే బుకింగ్ లు ప్రారంభించి పది రోజులు గడవకముందే హైలక్స్ బుకింగ్ లను నిలివేస్తున్నట్టు గురువారం సంస్థ ప్రకటించింది.

Latest Videos

undefined

ఇటీవల ప్రవేశపెట్టిన హైలక్స్ వాహనానికి తమ వినియోగదారుల నుంచి ఊహించని రీతిలో అద్భుతమైన స్పందన వచ్చిందని, భారత్ లో వాహనాన్ని విడుదల చేసిన రెండో రోజు నుంచే విపరీతంగా బుకింగ్ లు వచ్చినట్లు టయోటా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈక్రమంలో వచ్చిన బుకింగ్ లను ప్రాసెస్ చేసేందుకు తమవద్ద తగినంత సమయం లేదని, అందుకే తాత్కాలికంగా హైలక్స్ బుకింగ్ లు నిలిపివేస్తున్నట్టు టయోటా సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా భారత్ లో కార్ల తయారీ సంస్థలు చిప్ ల కొరత ఎదుర్కొంటున్నాయి. మైక్రో ప్రాసెసర్లు లేకుండా కార్లలో పనిచేయవు. దీంతో ప్రస్తుతం చిప్ లు డిమాండ్ సరిపడా అందుబాటులోకి వస్తే తప్ప.. ఈ కొరత తీరదు. హైలక్స్ పికప్ ట్రక్ బుకింగ్ లు నిలిపివేసేందుకు ఇది కూడా ఒక కారణంగా చెప్పిన సంస్థ.. తిరిగి బుకింగ్ లు ఎప్పుడు ప్రారంబిస్తామనే విషయాన్నీ వెల్లడించలేదు. ఇక చిప్ ల కొరతతో 2021 డిసెంబర్ నాటికే భారత్ లో 7 లక్షలకు పైగా కార్ల ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నట్లు ఇటీవల విడుదల చేసిన ఎకనామిక్ సర్వేలో కేంద్ర ఫైనాన్స్ మంత్రిత్వశాఖ పేర్కొంది.

click me!