టాప్ 5 ఎలక్ట్రిక్ వాహనాలు: అగ్రస్థానంలో మళ్లీ హీరో ఎలక్ట్రిక్.. భారీగా పడిపోతున్న ఆ బ్రాండ్ సేల్స్..

By asianet news teluguFirst Published Aug 2, 2022, 4:40 PM IST
Highlights

జూన్‌లో EV బ్రాండ్ హీరో ఎలక్ట్రిక్ మూడవ స్థానానికి పడిపోయింది. జూన్‌లో విక్రయించిన 6,504 ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే హీరో ఎలక్ట్రిక్ జూలైలో 8,786 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. 

హీరో ఎలక్ట్రిక్ (hero electric) గత కొన్ని నెలలుగా క్షీణత నమోదు చేసిన తర్వాత జూలై 2022లో భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థానాన్ని తిరిగి పొందింది. జూన్‌లో EV బ్రాండ్ హీరో ఎలక్ట్రిక్ మూడవ స్థానానికి పడిపోయింది. జూన్‌లో విక్రయించిన 6,504 ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే హీరో ఎలక్ట్రిక్ జూలైలో 8,786 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. దీంతో ప్రతినెల(MoM) 35 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2021 అదే నెలలో 4,223 యూనిట్లను విక్రయించటంతో గత నెలలో వాహన తయారీ సంస్థ   ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ (yoy) 108 శాతం పెరిగాయి. 

Okinawa 
కొద్ది నెలలుగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన EV బ్రాండ్‌లలో ఒకటైన ఓకినవ ఆటో టెక్ (Okinawa Autotech) జూలైలో 17 శాతం ప్రతినెల (MoM)అమ్మకాల వృద్ధిని నివేదించింది. ఈ ఏడాది జూన్‌లో 6,944 యూనిట్లు విక్రయించగా, జూలైలో కంపెనీ 8,093 యూనిట్లను విక్రయించింది. గత నెలలో ఒకినావా రెండో స్థానానికి పడిపోయింది. ప్రతి సంవత్సరానికి సంబంధించి ఒకినావా గత ఏడాది జూలైలో 2,580 యూనిట్లను విక్రయించింది, అంటే 214 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

ఓలా ఎలక్ట్రిక్ 
మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ (ola electric), రివోల్ట్ (revolt), ఏథర్ ఎనర్జీ (ather energy) ప్రతినెల అమ్మకాలు క్షీణించాయి. జూన్ 2022లో విక్రయించిన 5,886 యూనిట్లతో పోలిస్తే జూలై నెలలో 3,852 యూనిట్లతో ఓలా ఎలక్ట్రిక్ 35 శాతం క్షీణతను నమోదు చేసింది. 

రివోల్ట్ (Revolt) 
RV400 ఎలక్ట్రిక్ బైక్ ని విక్రయిస్తున్న రివోల్ట్ కూడా గత నెలలో అమ్మకాలు తగ్గినట్లు నివేదించింది. గత నెలలో 2,316 యూనిట్లను విక్రయించింది, ఈ ఏడాది జూన్‌లో విక్రయించిన 2,424 యూనిట్లతో పోలిస్తే నాలుగు శాతం క్షీణించింది. అయితే, రివోల్ట్ జూలై 2021లో కేవలం 317 యూనిట్లతో 631 శాతం వార్షిక అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. 

ఏథర్ ఎనర్జీ(Ather Energy)
ఏథర్ ఎనర్జీ కూడా గత నెలలో అమ్మకాల్లో 67 శాతం పడిపోయింది. ఏథర్ ఎనర్జీ ఈ ఏడాది జూలైలో 1,279 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది జూన్‌లో 3,829 యూనిట్లను విక్రయించింది. ఏథర్  సంవత్సర అమ్మకాలు కూడా 29 శాతం క్షీణించాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఏథర్ 1,799 యూనిట్లను విక్రయించింది.
 

click me!