లంబోర్ఘిని ఉరుస్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.15 కోట్ల నుండి మొదలవుతుంది, పెరల్ క్యాప్సూల్ ఎడిషన్ రూ. 3.43 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఇండియా పాపులర్ ర్యాప్ సింగర్ బాద్షా కొత్త లంబోర్గినీ ఉరస్ కారు డెలివరీ పొందారు. ఈ SUVని నియో నోక్టిస్ పెయింట్ స్కీమ్‌లో రూపొందించారు ఇంకా 22-అంగుళాల రిమ్‌లతో వస్తుంది. ఉరుస్ ప్రస్తుతం లంబోర్ఘిని లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తి. లంబోర్ఘిని ఉరుస్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.15 కోట్ల నుండి మొదలవుతుంది, పెరల్ క్యాప్సూల్ ఎడిషన్ రూ. 3.43 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఉరుస్‌తో పాటు బాద్షా దగ్గర ఆడి క్యూ8, రోల్స్ రాయిస్ వ్రైత్ ఉన్నాయి. బాద్షా లేటెస్ట్ కారు అతని రెండవ లంబోర్ఘిని ఉరస్, ఎందుకంటే అతను ఇంతకు ముందు ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) మార్కెట్ నుండి ఒక కార్ కొనుగోలు చేశాడు.
ఇంజిన్ అండ్ స్పీడ్
ఈ సూపర్ SUV వోక్స్‌వ్యాగన్ గ్రూప్ MLB Evo ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతుంది. ట్విన్-టర్బోచార్జ్డ్ 4.0-లీటర్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 641 bhp శక్తిని, 2,250 rpm వద్ద 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం, ఆల్-వీల్-డ్రైవ్ ఉరుస్ కేవలం 3.6 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 12.8 సెకన్లలో 0 నుండి 200 కి.మీ స్పీడ్ అందుకోగలదు. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 305 కి.మీ.
undefined
4 డ్రైవింగ్ మోడ్‌లు అండ్ ఫీచర్లు
ఈ SUVకి నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి - Strada, Sport, Corsa అండ్ Neve. అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, యాక్టివ్ డంపింగ్, 4-వీల్ డ్రైవ్, 4-వీల్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఈ కారులోఉన్నాయి. ఈ SUVలో ఎన్నో సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా ఉన్నాయి. ఈ కారులో అప్‌డేట్ చేసిన ఆప్షనల్ పార్కింగ్ అసిస్టెన్స్ ప్యాకేజీ, ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
ఉరుస్ ఇంజన్ అండ్ ప్లాట్‌ఫారమ్ వోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థల క్రింద వచ్చే ఎన్నో ఇతర SUVలతో భాగస్వామ్యం చేయబడింది. Porsche Cayenne, Audi RSQ8 మరియు Bentley Bentayga వంటి SUV కార్లు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నాయి. అంతేకాకుండా, ఇదే ఇంజన్ ఆడి RS6 అవంట్, పోర్షే పనామెరా, బెంట్లీ కాంటినెంటల్ GT వంటి వాహనాలలో కూడా ఉపయోగించారు.
1980లలో ప్రారంభించిన LM002 తర్వాత కంపెనీ నుండి 2018 ఉరస్ రెండవ SUV లాంచ్. LM002 బేర్, బేసిక్ అండ్ కఠినమైన SUV. లంబోర్ఘిని ఉరస్ డిసెంబర్ 2017లో ప్రపంచవ్యాప్తంగా, జనవరి 2018లో భారతీయ మార్కెట్‌లో లాంచ్ చేయబడింది.
జూన్‌లో లంబోర్ఘి 20,000 యూనిట్లకు పైగా ఉరుస్‌లను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. కంపెనీ భారతదేశంలో ఉరుస్ SUV 200 యూనిట్లను విక్రయించింది. 80 శాతం మంది ఉరుస్ కొనుగోలుదారులు లంబోర్ఘినిని తొలిసారిగా కొనుగోలు చేస్తున్నారని లాంబోర్గినీ వెల్లడించింది.
బాలీవుడ్ స్టార్లలో పాపులర్
భారత క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బహుమతిగా పొందిన కారు లంబోర్ఘిని ఉరస్ ఉన్న ప్రముఖులలో ఒకరు. లంబోర్ఘిని ఉరుస్ SUV బాలీవుడ్ స్టార్‌లలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా హీరో రణబీర్ సింగ్ అంతకు ముందు కార్తీక్ ఆర్యన్ ఈ సూపర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. అంతేకాకుండా సినీ దర్శకుడు రోహిత్ శెట్టి, వ్యాపారవేత్త అదార్ పూనావాలా, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖుల వద్ద కూడా ఈ శక్తివంతమైన SUV కార్ ఉంది.