విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతులు....

By Rekulapally SaichandFirst Published Oct 23, 2019, 11:32 AM IST
Highlights

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎగుమతుల్లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల సంస్థలకు ఊరట లభించింది. మోటారు సైకిళ్ల విభాగంలో నాలుగు శాతం ఎగుమతులు పెరిగాయి. మరోవైపు యుటిలిటీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. 
 

న్యూఢిల్లీ: ఒకవైపు దేశీయంగా ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతులు మాత్రం కాసింత ఊరటనిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్విచక్ర వాహనాల ఎగుమతులు నాలుగు శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) పేర్కొంది.

మోపెడ్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లతో కలిపి మొత్తం ద్విచక్ర వాహనాలు 17,93,957 యూనిట్లు ఎగుమతి అయ్యాయని సియామ్ తెలిపింది. గతేడాది తొలి అర్థభాగంలో ఎగుమతులు 17,23,280 యూనిట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

also read మళ్ళీ మార్కెట్లోకి హార్లీ డేవిడ్సన్ " లైవ్ వైర్"

దేశీయంగా మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు మాత్రం 16.18 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది తొలి అర్ధభాగంలో 1,15,68,498 యూనిట్లు అమ్ముడు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో 96,96,763 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

మోటారు సైకిళ్ల ఎగుమతులు 6.81 శాతం పెరిగాయి. స్కూటర్ల ఎగుమతులు 10.87 శాతం పెరిగితే మోపెడ్ల ఎగుమతులు 44.41 శాతానికి పడిపోయాయి. పుణె కేంద్రంగా పని చేస్తున్న బజాజ్ ఆటో 9,34, 581 యూనిట్ల వాహనాల ఎగుమతితో తొలి స్థానంలో నిలిచింది. 

తర్వాతీ స్థానంలో టీవీఎస్ మోటార్స్ ఉంది. టీవీఎస్ మోటార్స్ 3,43,337 యూనిట్లను ఎగుమతి చేసింది. మూడో స్థానంలో హోండా, నాలుగో స్థానంలో హీరో మోటో కార్ప్స్ నిలిచాయి.

హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా 1,74,469 యూనిట్లు ఎగుమతి చేసింది. హీరో మోటో కార్ప్స్ కేవలం 92,823 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. దేశీయంగా అత్యధికంగా బైక్ లు, స్కూటర్లు తయారు చేసే సంస్థ హీరో మోటో కార్ప్స్ కావడం గమనార్హం. 

also read జావా, రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా బెనెల్లి కొత్త బైక్

కార్లలో హ్యుండాయ్ టాప్.. ఎగుమతుల్లో కార్లు 19 శాతం రైజ్
కార్ల ఎగుమతుల్లో దక్షిణ కొరియా దిగ్గజం హ్యుండాయ్ మొదటి స్థానంలో నిలిచింది. 1,03,300 కారు యూనిట్లను ఎగుమతి చేసింది. అత్యధికంగా మెక్సికోకు కార్లు ఎగుమతి చేశారు. ప్రత్యర్థి ఫోర్డ్ ఇండియా ఫిగో, ఎకోస్పోర్ట్ ఎక్కువగా ఎగుమతి చేయగలిగింది. 

ఎగుమతుల్లో హ్యుండాయ్ మోటార్స్ 33.66 శాతానికి పైగా చేయగలిగింది. సెడాన్ మోడల్ కార్ల ఎగుమతులు 119.34 శాతం (34,772 యూనిట్లు) ఎగుమతి చేశాయి. గతేడాది కేవలం 15,853 యూనిట్లు మాత్రమే ఎగుమతయ్యాయి. 

19 శాతం కార్ల ఎగుమతులు పెరిగినా హ్యుండాయ్ క్రెటా మాత్రం ఆరో స్థానం నుంచి ఏడు స్థానానికి పడిపోయింది. గ్రాండ్ ఐ10, కంపాక్ట్ సెడాన్ ఎక్స్ సెంట్ తొమ్మిదో, పదో స్థానాన్ని ఆశ్రయించాయి. 

also read భారతదేశంలో టొయోట ఎలట్రిక్ వాహనలు

గ్రాండ్ ఐ10 కారు ఎక్కువగా దక్షిణాఫ్రికా, ట్యునిషియా, లాటిన్ అమెరికా, చిలీ, మెక్సికో, పెరు, నేపాల్ తదితర కీలక దేశాల్లో అమ్ముడైంది. హ్యుండాయ్ మోటార్స్ 91కి దేశాలకు పైగా వాహనాలను ఎగుమతులు చేసింది. 

జనరల్ మోటార్స్ 40,096 యూనిట్లు, ఫోర్ట్ ఎకో స్పోర్ట్ కార్లు 38,583 యూనిట్లు విక్రయించింది. ఫోర్డ్ హ్యాచ్ బ్యాక్ ఫిగో ఐదో స్థానంలో నిలిచింది. ఫిగో మోడల్ కార్లు 26,643 యూనిట్ల ఎగుమతితో 3.9 శాతం పెంచుకున్నది. 

ఇక భారతదేశంలో అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 21,036 యూనిట్లను ఎగుమతి చేసి ఎనిమిదో స్థానంలో నిలిచింది. జపాన్ నిస్సాన్ ఇండియా తన సెడాన్ కార్లు 26,590 యూనిట్లను ఎగుమతి చేసింది. 

click me!