పది పైసల ఖర్చుతో కిలోమీటరు దూరం ప్రయాణించే ఈ- బైస్కిల్ తయారుచేశాడు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాకు చెందిన ఆదిత్య శివ్‌హరే (20).
ఈ రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ . 100 మార్కును కూడా దాటేసింది. అయితే ప్రస్తుత కాలంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఈ- బైస్కిల్ ని తయారు చేసాడు. దీని ప్రత్యేకత ఏంటంటే పది పైసల ఖర్చుతో కిలోమీటరు దూరం ప్రయాణించొచ్చు. దీనిని తయారు చేసిన 20 ఏళ్ల వ్యక్తి పేరు ఆదిత్య శివ్‌హరే. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా నివాసి.
అయితే ఈ సైకిలు 100 కేజీల బరువును కూడా మోసుకెళ్తుందని ఆదిత్య శివ్‌హరే అన్నారు. ఆదిత్య శివ్‌హరే తాను తయారు చేసినవి పేదలకు ఉపయోగపడెల ఉండాలని ఆలోచనతో బ్యాటరీతో నడిచే ఈ సైకిలును రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. దీని కోసం నెల రోజులు పాటు శ్రమించాడు. ఇంకా ఎప్పుడూ ఏదో ఒకటి తయారుచేస్తూ ఎన్నో అవార్డులు కూడా ఆదిత్య శివ్‌హరే అందుకున్నాడు. దీని తయారీకి మొత్తం రూ.20 వేల దాకా ఖర్చయిందట. దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ సైకిలుకు బైక్‌కు ఉండే కొన్ని సౌకర్యాలను ఆదిత్య కల్పించాడు. ఈ బ్యాటరీ సైకిలుకు ‘తి-1’ అని పేరు కూడా పెట్టాడు.