బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు కాల్స్ రావడంతో పెరుగుతున్న బెదిరింపుల కాల్స్ కారణంగా, సల్మాన్ ఖాన్ ఇప్పుడు నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవిని దుబాయ్ నుండి దిగుమతి చేసుకున్నాడు. ఈ కార్ హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారు. అంతే కాదు ఈ కారులో ఎన్నో సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు రోజురోజుకూ ప్రాణహానితో జీవిస్తున్నాడు. ఓ వైపు బెదిరింపులు, మరోవైపు ముంబై పోలీసులకు సల్మాన్ కుటుంబానికి బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్, ఇమెయిల్ వస్తున్నాయి. దీంతో ముంబై పోలీసులు కూడా సల్మాన్ ఖాన్‌కు తగిన భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ ప్రయాణాల కోసం హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ కారును దిగుమతి చేసుకున్నాడు. ఎందుకంటే నిస్సాన్ పెట్రోల్ కారు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేదు. కాబట్టి ఈ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కారు. కారులో ఏ భాగం నుంచి కాల్పులు జరిగినా లోపల ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగదు. కారు వీల్స్ కూడా ఎలాంటి ప్రమాదానైనా నివారించగలవు. బుల్లెట్లు, మంటలు వచ్చినా కారు వీల్స్ షేక్ అవ్వవు. కారు విండోస్ కి 78 ఎంఎం గ్లాస్ ఉపయోగించారు. ఇది సర్టిఫైడ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.
undefined
కారు కింది భాగం కూడా బాంబు పేలుళ్లను తట్టుకోగలదు. ఈ కారుపై విసిరిన పెట్రోల్ బాంబులతో సహా తక్కువ తీవ్రత కలిగిన బాంబులను కూడా ఆపగలదు. కారు లోపల ఉన్న శత్రువుల నుండి రక్షించడానికి లేదా ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఆర్మర్ రెసిస్టన్స్ అందించగల ఫీచర్ కూడా ఈ కారులో ఉంది. కానీ ఈ ఫెసిలిటీ ప్రధానమంత్రి, రాష్ట్రపతితో సహా ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగుల కార్లలో మాత్రమే ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతించబడుతుంది.
నిస్సాన్ పెట్రోల్ అనేది ఒక SUV కారు. ఇందులో 5.6 లీటర్ v8 పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 405hp శక్తిని, 560Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. కొత్త నిస్సాన్ పెట్రోల్ ధర AED 206,000. భారతీయ రూపాయికి మార్చుకుంటే 46 లక్షల రూపాయలు. అయితే ఈ కారును బయటి దేశం నుండి దిగుమతి చేసుకోవాలి. ఇండియాలో దిగుమతి సుంకం అధికం. అయితే దిగుమతి చేసుకున్న తరువాత కారు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్షూరెన్స్ అన్నీ కలిపితే దాదాపు కోటి రూపాయలు అవుతుంది.
నిస్సాన్ పెట్రోల్ కారు కంటే ముందు సల్మాన్ ఖాన్ కి మరో బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఉంది. అదే సల్మాన్ ఖాన్ కి చెందిన టయోటా ల్యాండ్ క్రూయిజర్. ప్రస్తుతం ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ ఎడిషన్ కారులో ప్రయాణిస్తున్న సల్మాన్.. తాజాగా సల్మాన్ ఖాన్ కి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ప్రాణహాని ఎక్కువగా ఉండడంతో సల్మాన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారులో ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు నిస్సాన్ పెట్రోల్ సల్మాన్ కి బుల్లెట్ ప్రూఫ్ రక్షణను అందించగల రెండవ కారు.