వీడు మామూలోడు కాదు... 30 సెకన్లలో రూ.15 కోట్ల కారు మాయం..

By asianet news telugu  |  First Published Dec 2, 2023, 6:08 PM IST

ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. రోల్స్ రాయిస్ యొక్క ఈ హైటెక్ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాంటెన్నా సాయంతో కారు తాళం తెరిచినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
 


టెక్నాలజీ  అభివృద్ధి చెందడంతో దొంగలు కూడా హైటెక్‌గా మారారు. అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా పేరొందిన రోల్స్ రాయిస్‌ను తాళం లేకుండా కేవలం 30 సెకన్లలో దొంగలు దోచుకెళ్ళడం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. రోల్స్ రాయిస్ ఈ హైటెక్ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాంటెన్నా సాయంతో కారు లాక్ తీసి స్టార్ట్ చేయడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

ఈ కేసు బ్రిటన్‌లోని ఎసెక్స్ అవెలీకి చెందినది. వైరల్ వీడియో ప్రకారం, ఇద్దరు దొంగలు హుడీస్ ధరించి కారు సమీపంలోకి వచ్చారు. ఒకరు రెండు చేతుల్లో యాంటెన్నాతో కారు తాళం ఉన్న  గదిని చేరుకున్నారు. రెండో దొంగ కారు దగ్గరే ఉన్నాడు. మొదటి దొంగ యాంటెన్నాతో తాళం ఉన్న  రూమ్ దగ్గరకు రాగానే, అదే సమయంలో కారు లైట్లు వెలిగించి రెండో దొంగ కారు స్టార్ట్ చేస్తాడు.

Latest Videos

undefined

ఈ రకమైన టెక్నాలజీని 'రిలేయింగ్' అంటారు. రెండవ దొంగ ట్రాన్స్‌మిటర్‌ తో ఉన్నాడు, దీని  సహాయంతో అతను కారు కీ నుండి వచ్చే సిగ్నల్‌ను పట్టుకుని దానిని కారుకు ప్రసారం చేశాడు, ఆ తర్వాత నలుపు రంగు రోల్స్ రాయిస్ స్విచ్ ఆన్ చేశాడు. ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ఇంటి గేటుకు దూరంగా ఒక గదిలో కారు కీలను ఉంచడం మంచిది.  

Rolls Royce stolen using an antenna to pick up the owner's key signal pic.twitter.com/PKBJG1f1Da

— Crazy Clips (@crazyclipsonly)

 

click me!