గంటలో హైదరాబాద్ నుండి విజయవాడ.. ఈ కార్ స్పీడ్ చాల ఫాస్ట్ గురు...

By asianet news telugu  |  First Published Nov 24, 2023, 12:44 AM IST

HiPhi A పేరుతో ఈ సూపర్ సెడాన్ చైనీస్ EV తయారీదారులచే తయారు చేయబడింది. విషయం ఏంటంటే లగ్జరీ అండ్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి ఇంకా ఉత్పత్తిపై దృష్టి పెడుతుంది. HiPhi Z EV ఆధారంగా కొత్త సెడాన్ 2023 గ్వాంగ్‌జౌ ఆటో షోలో ప్రదర్శించబడుతోంది.


గత కొన్నేళ్లుగా చైనా దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రంగా మారింది. దేశంలోని వివిధ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌లతో తమ ప్రత్యేకమైన ఉత్పత్తులను విడుదల చేయడం ప్రారంభించాయి. వాటిలో కొన్ని బడ్జెట్  ధరకే  మాస్-మార్కెట్ ఉత్పత్తుల రూపంలో వస్తున్నాయి. కొన్ని ప్రముఖ ప్రపంచ బ్రాండ్‌లు లగ్జరీ కార్లను టార్గెట్ గా చేసుకున్నాయి. కొన్ని హై-ఎండ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో స్పోర్టీ పర్ఫార్మెన్స్ తో ఉంటున్నాయి. ఇందులో ఇండియన్ లేటెస్ట్  HiPhi A ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ సూపర్ సెడాన్.
 
 పవర్ అండ్  స్పీడ్
HiPhi A పేరుతో ఈ సూపర్ సెడాన్ చైనీస్ EV తయారీదారులచే తయారు చేయబడింది. విషయం ఏంటంటే లగ్జరీ అండ్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి ఇంకా ఉత్పత్తిపై దృష్టి పెడుతుంది. HiPhi Z EV ఆధారంగా కొత్త సెడాన్ 2023 గ్వాంగ్‌జౌ ఆటో షోలో ప్రదర్శించబడుతోంది. ఈ EV 1,270 bhp పవర్   ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌ ఉంది. దీనితో కారు టాప్ స్పీడ్  300 kmph స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇంకా ఈ  EV కేవలం 2 సెకన్లలో 0 నుండి 96 kmph వరకు స్పీడ్  అందుకోగలదని పేర్కొంది. 2025 ప్రారంభం నుండి ఎలక్ట్రిక్ సెడాన్ విక్రయాలను ప్రారంభిస్తామని HiPhi తెలిపింది. 

లుక్: 
HiPhi A డిజైన్ గురించి మాట్లాడితే ఎలక్ట్రిక్ సూపర్ సెడాన్  ఫ్రంట్ ప్రొఫైల్ నిస్సాన్ GT-R నుండి ప్రేరణ పొందింది. అలాగే  ఆకర్షణీయమైన ఫ్రంట్ ప్రొఫైల్ తో ఉంటుంది. ఇందులో స్లీక్  LED డే లైట్  రన్నింగ్ లైట్లతో స్లాంటెడ్ అండ్  షార్ప్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ, HiPhi A బ్లాక్ మెష్‌తో కూడిన పెద్ద గ్రిల్‌  ఉంది. దీని మొత్తం డిజైన్  సెడాన్ కంటే పొడవైన  హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపిస్తుంది. ఇంకా మందపాటి అలాగే  పెద్ద బ్లాక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, దీని వల్ల డిజైన్‌కు బోల్డ్‌నెస్‌ని తీసుకొస్తుంది. కారు వెనుక లుక్ గురించి మాట్లాడితే టైల్‌లైట్, రెండు-భాగాల స్పాయిలర్ ఇంకా పెద్ద డిఫ్యూజర్‌గా పనిచేసే LED స్ట్రిప్‌  పొందుతుంది.

Latest Videos

undefined

డిజైన్
ఈ EVలో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి, వాటిలో ఒకటి ముందు, రెండు వెనుక  అమర్చబడి ఉంటాయి. HiPhi, EVని ఇంటర్నల్ గా  డిజైన్ చేసి అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. దీని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను కూడా కంపెనీ స్వయంగా రూపొందించింది. ఈ EVలో పవర్ కోసం పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. అయితే, కంపెనీ  ఇంకా బ్యాటరీ ప్యాక్ పరిమాణాన్ని వెల్లడించలేదు. దీనిని 800-వోల్ట్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడింది.

ఈ EV HiPhi Zతో భాగస్వామ్యం చేయబడిన ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్‌తో అమర్చబడింది. మార్చి 2023లో ప్రవేశపెట్టబడింది. అదనంగా, కొత్త EV వెనుక స్టీరింగ్ సెటప్, అడాప్టివ్ డంపర్లు ఇంకా  కొత్త టార్క్ వెక్టరింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. 

click me!