ఎలక్ట్రిక్ వెర్షన్ లో టాటా చిట్టి కారు.. ఈసారి ఎలాంటి ఫీచర్స్ ఉండొచ్చంటే..

Published : Dec 09, 2022, 11:57 AM IST
 ఎలక్ట్రిక్ వెర్షన్ లో టాటా చిట్టి కారు..  ఈసారి ఎలాంటి ఫీచర్స్ ఉండొచ్చంటే..

సారాంశం

మే 2018లో ఈ కారు ఉత్పత్తి  నిలిపివేయబడింది. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ 624cc, ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేసారు, ఇంకా 38bhp పవర్ అండ్ 51Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఏప్రిల్ 2020లో ఇండియాలో బి‌ఎస్6 ఇంధన ఉద్గార ప్రమాణాలని అమలు చేయడంతో దేశీయ కార్ల తయారీ సంస్థ  టాటా మోటార్స్  చిన్న కారు నానో అండ్ సఫారి స్టోర్మ్ ఎస్‌యూ‌విని నిలిపివేసింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర ఇంకా చిన్న కారుగా ప్రచారం పొందిన టాటా నానో  ఇండియాలో కంపెనీకి సేల్స్ అందించడంలో విఫలమైంది. కానీ ఈ కారు కంపెనీకి చాలా ముఖ్యమైనది. ఇంకా టాటా నానో కంపెనీ చైర్మన్ రతన్ టాటా హృదయానికి చాలా దగ్గరైంది. 

మే 2018లో ఈ కారు ఉత్పత్తి  నిలిపివేయబడింది. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్ 624cc, ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేసారు, ఇంకా 38bhp పవర్ అండ్ 51Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్ లేదా AMT గేర్‌బాక్స్‌తో అందిస్తున్నారు, దీని ద్వారా పవర్ వెనుక వీల్స్ కి పంపబడుతుంది. 

తాజా మీడియా నివేదిక ప్రకారం, దేశీయ వాహన తయారీ సంస్థ టాటా నానోను ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో మళ్లీ పరిచయం చేయడానికి అంచనా వేస్తోంది. టాటా నానో EV మెకానికల్ వివరాలు, సస్పెన్షన్ సెటప్ అండ్ టైర్లలో ముఖ్యమైన మార్పులు చూడవచ్చు. 

టాటా నానో EV ప్లాన్ ఉత్పత్తి దశకు చేరుకున్నట్లయితే, మరమలైనగర్‌లోని ఫోర్డ్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ  చర్చలను తిరిగి ప్రారంభించవచ్చని నివేదికలు పేర్కొంది. ప్రస్తుతం టాటా నానో ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

EV లైనప్
ప్రస్తుతం, కంపెనీ ఇండియాలో మూడు EVలను విక్రయిస్తోంది - Tigor EV, Xpres-T అండ్ Nexon EV. తాజాగా టాటా టియాగో EV ధరలను రూ.8.49 లక్షల నుండి మొదలై రూ.11.79 లక్షల వరకు ఉంటుందని  ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ డెలివరీలు జనవరి 2023లో ప్రారంభమవుతాయి. 

బ్యాటరీ, పవర్ అండ్ రేంజ్
టాటా టియాగో EV రెండు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లతో అందించబడుతోంది - 19.2kWh, 24kWh,  అంటే 250km అండ్ 315km (MIDC) ప్రయాణిస్తాయి. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా  జిప్‌ట్రాన్ హై-వోల్టేజ్ టెక్నాలజీతో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటారుతో ఆధారితమైనది. ఈ మోటార్ చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 61bhp/110Nm, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో 774bhp/114Nm పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

ఛార్జింగ్ ఆప్షన్స్ 
Tiago EV మూడు ఛార్జింగ్ ఆప్షన్స్ లో వస్తుంది - 50kW DC ఫాస్ట్ ఛార్జర్ (57 నిమిషాల్లో 80%), 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్ (2h 35m - 19.2kWh & 3h 35m - 24kWh), 3.3kW హోమ్ ఛార్జర్ (5 గంటల్లో 5 నిమిషాలలో 100%  - 19.2kWh బ్యాటరీ / 6 గంటల 20 నిమిషాలు - 24kWh బ్యాటరీ).

PREV
click me!

Recommended Stories

MG Comet : అసలే చవకైన ఈవీ కారు.. ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్లో మరో రూ.1 లక్ష డిస్కౌంట్
Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్