టాటా మోటార్స్ వినియోగదారులకు షాక్.. ఈ వాహనాలు ఏప్రిల్ 1 నుండి..

By asianet news teluguFirst Published Mar 23, 2023, 2:02 PM IST
Highlights

టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను ఏప్రిల్ 1, 2023 నుండి పెంచనున్నట్లు సమాచారం. అయితే, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఈ పెంపుదల ఉండదు. అయితే ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలు పెరగనున్నాయని కంపెనీ తెలిపింది.
 

దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వాహనాల ధరలను పెంచబోతోంది. ఒక నివేదిక ప్రకారం ఏప్రిల్ 1 నుంచి వాహనాల ధరలను కంపెనీ పెంచనుంది. ఏ వాహనాల ధరలను కంపెనీ పెంచనుంది.. పెంపుకుగల కారణాలు తెలుసుకుందాం...  

పెరగనున్న ధరలు
టాటా మోటార్స్ కంపెనీ వాహనాల ధరలను ఏప్రిల్ 1, 2023 నుండి పెంచనున్నట్లు సమాచారం. అయితే, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఈ పెంపుదల ఉండదు. అయితే ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలు పెరగనున్నాయని కంపెనీ తెలిపింది.

ఎంత పెరుగుదల ఉంటుందంటే 
కంపెనీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల ఐదు శాతం ఉంటుంది. విశేషమేమిటంటే.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఆర్‌డి‌ఈ  నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో పలు కంపెనీలు వాహనాల ధరలను పెంచబోతున్నాయి.

ఇంజిన్ అప్ డేట్స్ 
BS-VI సెకండ్ ఫేస్ నిబంధనల ప్రకారం అన్ని వాణిజ్య వాహనాల ఇంజిన్‌లను కంపెనీ అప్ డేట్ చేసింది. దీంతో ఇంజన్ ధర కూడా పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి కంపెనీ ఈ పెంపును అమలు చేయనుంది, అయితే అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను ఐదు శాతం పెంచనుంది.

కస్టమర్లకు ఈ బెనెఫిట్స్ 
కంపెనీ ధరలను  పెంచినప్పటికి కస్టమర్లు ఎన్నో ఇతర మార్గాల్లో బెనెఫిట్స్ పొందగలుగుతారు. వీటిలో అతిపెద్ద ప్రయోజనం  . ఇంజిన్లో అప్ డేట్ తర్వాత ఆవరేజ్ పెరుగుతుంది. దీని వల్ల తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం వాహనాలను నడపవచ్చు. దీంతో  వినియోగదారులకి ఫ్యూయెల్ కోసం ఖర్చు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్లు టెక్నికల్ గా మెరుగైన శక్తిని ఇస్తాయి ఇంకా పర్యావరణానికి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.

టాటా కంపెనీ పోర్ట్‌ఫోలియో 

కంపెనీ వాణిజ్య వాహనాల విభాగంలో అనేక రకాల వాహనాలను విక్రయిస్తోంది.  వీటిలో టాటా Ace Gold, Intra V10, Intra V30, Intra V50, Yodha 2.0, Yodha Pik-up, Light Commercial Truck, ICV, Ultra ICV, Tipper, Rigid Truck, Construct, MHCV వంటి వాహనాలు ఉన్నాయి.
 

click me!