RDE Norms: మారుతి నుండి టాటా వరకు ఈ కార్లను కోనేందుకు కొద్దిరోజులే అవకాశం.. ఎందుకంటే..?

By asianet news telugu  |  First Published Mar 21, 2023, 1:47 PM IST

హోండా కంపెనీ ఇండియన్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ నుండి సెడాన్ సెగ్మెంట్ వరకు అనేక కార్లను అందిస్తోంది. కానీ మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ హోండా సిటీ ఫోర్త్ జనరేషన్, సిటీ ఫిఫ్త్ జనరేషన్ డీజిల్ వేరియంట్, అమేజ్, జాజ్ ఇంకా WRV డీజిల్ వేరియంట్‌లను నిలిపివేయవచ్చు.


దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీలు అందించే ఎన్నో కార్లలోని కొన్ని వేరియంట్‌లను కొనుగోలు చేయడానికి ఇదే చివరి అవకాశం. ఎందుకంటే మీడియా కథనాల ప్రకారం, 31 మార్చి 2023 తర్వాత కంపెనీలు కొన్ని  కార్లను నిలిపివేయనున్నాయి. అయితే అవెంటో వాటి గురించి తెలుసుకుందాం...

హోండా
హోండా కంపెనీ ఇండియన్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ నుండి సెడాన్ సెగ్మెంట్ వరకు అనేక కార్లను అందిస్తోంది. కానీ మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ హోండా సిటీ ఫోర్త్ జనరేషన్, సిటీ ఫిఫ్త్ జనరేషన్ డీజిల్ వేరియంట్, అమేజ్, జాజ్ ఇంకా WRV డీజిల్ వేరియంట్‌లను నిలిపివేయవచ్చు. అయితే, ఇప్పటికే కొన్ని మోడళ్ల ఉత్పత్తి నిలిపివేయబడింది, మిగిలిన యూనిట్లను మాత్రమే మార్కెట్లో విక్రయిస్తున్నారు.

Latest Videos

మహీంద్రా
SUVలలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా కూడా ఏప్రిల్ 1, 2023లోపు కొన్ని మోడల్‌లు ఇంకా వేరియంట్‌లను నిలిపివేయవచ్చు. మార్చి 31 వరకు మాత్రమే కొనుగోలు చేయగల మోడళ్లలో మహీంద్రా  మరాజో, అల్టురాస్ జి4, కెయువి100 ఉన్నాయి. ఏప్రిల్ 1 తర్వాత విక్రయించే కార్లను కంపెనీ ఇప్పటికే అప్‌డేట్ చేసింది.

హ్యుందాయ్
హ్యుందాయ్ మార్కెట్లో ఉన్న కొన్ని వేరియంట్లను కూడా నిలిపివేస్తుంది. నివేదికల ప్రకారం, ఆల్కాజర్ డీజిల్, పాత వెర్నా  డీజిల్ వేరియంట్‌లను కంపెనీ నిలిపివేస్తుంది. కంపెనీ ప్రకారం, డీజిల్ ఇంజిన్ కార్లకు డిమాండ్ తగ్గింది, ఈ సందర్భంలో కంపెనీ పెట్రోల్ అండ్ CNG ఆప్షన్ పై మాత్రమే దృష్టి పెడుతుంది.

మారుతి, టాటా
మారుతీ అండ్ టాటా వంటి కంపెనీలు 31 మార్చి 2023 తర్వాత వాటి వాహనాలలో కొన్ని వేరియంట్‌లను కూడా నిలిపివేయవచ్చు. నివేదికల ప్రకారం, మారుతి ఆల్టో 800, టాటా ఆల్ట్రోజ్ డీజిల్, నిస్సాన్ కిక్స్ వంటి మోడల్‌లు కూడా ఏప్రిల్ 1, 2023 నుండి అందుబాటులో ఉండవు.

బంపర్ డిస్కౌంట్ 
కస్టమర్లకు పలు కార్లపై కంపెనీలు బంపర్ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఏప్రిల్ 1 నుండి విక్రయించలేని కార్ల స్టాక్ కంపెనీల వద్ద ఉన్నందున ఈ బంపర్ డిస్కౌంట్  అందిస్తుంది. అందుకే ఈ కార్ల స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లను ఇస్తున్నాయి.

click me!