టాటా మోటార్స్ ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. అయితే ఈ నెలలో టాటా కార్లను కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.
దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(tata motors) ఫిబ్రవరి నెలలో టాటా కార్ల మోడళ్లపై కొత్త ఆఫర్లు ఇంకా తగ్గింపులను తీసుకొచ్చింది. ఈ నెలలో టాటా కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 40,000 వరకు బెనెఫిట్స్ అందజేస్తున్నారు.
ఏ కార్లపై ఆఫర్లు
టాటా కంపెనీ కొత్త ఆఫర్ కింద టియాగో (tiago), టిగోర్ (tigor), నెక్సాన్ (nexon), హారియర్ (harrier), సఫారి (safari) కార్లపై డిస్కౌంట్లు, బెనెఫిట్స్ పొందవచ్చు. ఈ బెనెఫిట్స్ ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు కార్పొరేట్ బెనెఫిట్స్ రూపంలో కస్టమర్‌లు పొందవచ్చు.
undefined
టియాగో అండ్ టిగోర్‌పై ఆఫర్‌లు
కొత్త టాటా టియాగో (tata tiago), టాటా టిగోర్ (tata tigor)పై ప్రస్తుతం రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన టియాగో అండ్ టిగోర్ సిఎన్‌జి ట్రిమ్‌లపై ఈ ఆఫర్‌లు వర్తించవని గమనించాలి. అంతేకాకుండా కంపెనీ రూ. 2,500 గ్రామీణ తగ్గింపుగా, రూ. 3,000 కార్పొరేట్ బెనిఫిట్ గా, ఆరోగ్య కార్యకర్తలకు రూ. 3,000 తగ్గింపును కూడా అందిస్తోంది.
టాటా నెక్సాన్ పై ఎలాంటి తగ్గింపులు
టాటా నెక్సాన్ పై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. అలాగే, కార్పొరేట్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ పథకం కింద పెట్రోల్ ట్రిమ్‌లపై రూ.3,000 తగ్గింపు, డీజిల్ ఇంజన్ మోడల్‌లపై రూ.5,000 తగ్గింపు ఇస్తోంది. ఈ ఆఫర్ డార్క్ ఎడిషన్ రేంజ్ మినహా మొత్తం నెక్సాన్ కి వర్తిస్తుందని గమనించాలి.
సఫారి అండ్ హారియర్‌లపై తగ్గింపు
టాటా పెద్ద ఎస్‌యూవి కార్లు టాటా హారియర్ (tata harrier) అండ్ టాటా సఫారి (tata safari)ని ఫిబ్రవరి నెలలో కొనుగోలు చేస్తే రూ.40,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌గా ఇవ్వనుంది.అంతేకాకుండా టాటా హారియర్ ఎస్‌యూవి పై కార్పొరేట్ తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల పథకం కింద రూ. 5,000 తగ్గింపును పొందుతోంది. ఈ ఆఫర్ కారు అన్ని వేరియంట్లపై వర్తిస్తుంది.