టాటా మోటార్స్ తో లిథియం అర్బన్ ఒప్పందం :500 కార్లు ఆర్డర్

By Sandra Ashok KumarFirst Published Nov 18, 2019, 6:04 PM IST
Highlights

టాటా మోటార్స్ మరియు లిథియం అర్బన్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడానికి ఒప్పందం కుదుర్చుకునాయి. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా కార్ల తయారీదారి 400 యూనిట్ల టాటా టిగర్  మరియు టాటా నెక్సాన్ ఇవితో సహా రాబోయే మరో 100 ఎలక్ట్రిక్ కార్లను అందించనుంది.

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) ఫ్లీట్ ప్రొవైడర్ టాటా మోటార్స్ మరియు లిథియం అర్బన్ టెక్నాలజీస్ మార్కెట్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా  లిథియం అర్బన్ టెక్నాలజీస్ కొత్తగా ప్రారంభించిన లాంగ్-రేంజ్ టాటా టిగర్ సెడాన్ ఇవి సెడాన్ యొక్క 400 యూనిట్లను అందించనుంది.

ఇది 2019-2020 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశం అంతటా పంపిణీ చేయనుంది. మిగిలిన 100 ఎలక్ట్రిక్ వాహనాలను కార్పొరేట్ రవాణా సేవల వంటి వాటికి ఉపయోగించనున్నారు. కొత్త ఆర్డర్ భాగస్వామ్యం గురించి టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ & కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, "ఇది టాటా మోటార్స్ యొక్క ఇ-మొబిలిటీ బిజినెస్‌కు అత్యంత ముఖ్యమైన మైలురాయి మాత్రమే కాదు ఒక పెద్ద మలుపు కూడా.

also read ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్‌లో చేరిన ఇండియన్...స్కూటర్

ఎలక్ట్రిక్ రవాణా సేవలను వేగంగా విస్తరించే  ప్రయాణంలో ఉన్న లిథియంతో ఈ భాగస్వామ్యంలోకి ప్రవేశించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విలువను పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము "

మరోవైపు లిథియం అర్బన్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు సంజయ్ కృష్ణన్ మాట్లాడుతూ, "టాటా మోటార్స్‌తో ఈ భాగస్వామ్యం కొత్త ఫారమ్ లభ్యతను నిర్ధారిస్తుంది. భారతదేశం అంతటా తమ కార్యాలయాలకు ఉద్యోగుల రవాణా సేవలను అందించడానికి లిథియం ఇటీవల టెక్ దిగ్గజం విప్రోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది అలాగే టాటా నుండి సేకరించిన వాహనాలను విప్రో ఒప్పందానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఇటీవల ప్రారంభించిన లాంగ్-రేంజ్ టాటా టిగర్ ఇ.వి ఒకే ఛార్జీతో  213 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. XE +, XM + మరియు XT + అనే 3 వేరియంట్లలో లభ్యమవుతుంది. టైగర్ ఎలక్ట్రిక్ కారు 30 ప్రధాన నగరాల్లో లభిస్తుంది, దీని ధరలు ₹ 9.44 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి.

also read స్పీడ్‌లో రికార్డు:1.69 సెకన్లలో 100 కిమీ వేగం.. ధరెంతంటే

టైగర్ ఇవి 72 వి 3-ఫేజ్ ఎసి ఇండక్షన్ మోటర్‌తో వస్తుంది. ఇది 21.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటారు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 30 కిలోవాట్లను (40.2 బిహెచ్‌పి) ఉత్పత్తి చేయగలదు. 2500 ఆర్‌పిఎమ్ వద్ద 105 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది.

టాటా ev కారుకి ఎసి ఛార్జర్, ఫాస్ట్ డిసి ఛార్జర్ రెండింటి ఎంపికను అందిస్తుంది. దీని బ్యాటరీ 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 11.5 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ తో 2 గంటల్లో 80 శాతం శక్తిని అందిస్తుంది. కారు యొక్క టాప్ స్పీడ్ 80 కి.మీ.
 

click me!