Tata Harrier:టాటా మోటార్స్ పవర్ ఫుల్ ఎస్‌యూ‌వి కొత్త వేరియంట్‌.. ఈ లగ్జరీ ఫీచర్స్ కారు ధర ఎంతంటే..?

By asianet news telugu  |  First Published May 18, 2022, 11:10 AM IST

ఫీచర్ల పరంగా  కొత్త హారియర్ XZS వేరియంట్‌లో 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్జస్టబుల్ లంబార్ సపోర్ట్, ఆటో డిమ్మింగ్ IRVMలు ఉన్నాయి. 


టాటా మోటార్స్ ఎస్‌యూ‌వి సెగ్మెంట్‌లో  హారియర్ మోడల్ లైనప్‌ను విస్తరించింది. కంపెనీ ఈ కారులో కొత్త XZS వేరియంట్‌ను విడుదల చేసింది. దీనిని XZ అండ్ రేంజ్-టాపింగ్ XZ+ ట్రిమ్‌ల మధ్య ఉంచింది. XZతో పోల్చితే కొత్త టాటా హారియర్ XZS వేరియంట్ ధర దాదాపు రూ. 1.25 లక్షల నుండి రూ. 1.30 లక్షలు ఎక్కువ, టాప్-ఎండ్ XZ+ ట్రిమ్ కంటే దాదాపు రూ. 35,000 తక్కువగా ఉంటుంది. 

ధర ఎంత
కొత్త టాటా హ్యారియర్ ఎక్స్‌జెడ్‌ఎస్ ధర రూ.20 లక్షలు. XZS డ్యూయల్-టోన్ వేరియంట్ ధర రూ. 20.20 లక్షలు, XZAS డ్యూయల్-టోన్ వేరియంట్ ధర రూ. 21.50 లక్షలు. XZS డార్క్ ఎడిషన్ ధర  రూ. 20.30 లక్షలు అండ్ XZAS డార్క్ ఎడిషన్ ధర రూ. 21.60 లక్షలు కాగా, XZAS వేరియంట్ ధర రూ. 21.30 లక్షలు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ చెందినవి. 

Latest Videos

undefined

ఫీచర్ల పరంగా  కొత్త హారియర్ XZS వేరియంట్‌లో 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్జస్టబుల్ లంబార్ సపోర్ట్, ఆటో డిమ్మింగ్ IRVMలు ఉన్నాయి. అయితే, టాప్-ఎండ్ XZ+ ట్రిమ్ కంటే చౌకైనందున XZ+లో కనిపించే iRA కనెక్ట్ కార్ టెక్నాలజీ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు ఉండవు. 

అంతేకాకుండా, ఫీచర్ లిస్ట్ లో Xenon HID ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లేతో 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్యాక్ పార్కింగ్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ AC, వైపర్లు ఇంకా హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

ఇంజిన్
కొత్త టాటా హారియర్ XZS వేరియంట్  ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్త టాటా హారియర్ XZS వేరియంట్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 170PS పవర్, 350Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్  ఉంటాయి.

నివేదికలు నిజమైతే  కంపెనీ మిడ్-లైఫ్ అప్‌డేట్‌తో హారియర్ మోడల్ లైనప్‌లో కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేస్తుంది. హారియర్ ఫేస్‌లిఫ్ట్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, అప్‌డేట్  ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను పొందే అవకాశం ఉంది. 

click me!