Aprilia Price Hike:మీరు అప్రిలియా స్కూటర్‌ కొనేందుకు చూస్తున్నారా.. కొత్త ధరల లిస్ట్ ఇదే..

By asianet news telugu  |  First Published May 17, 2022, 12:11 PM IST

భవిష్యత్తులో అప్రిలియా బైక్స్ ధరలను కూడా పెంచే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుతం 660సీసీ, 1100సీసీ బైక్‌లను అందిస్తోంది. అప్రిలియా ప్రస్తుతం 125సీసీ, 160సీసీ  స్కూటర్లను విక్రయిస్తోంది. 


దాదాపు అన్ని ఇతర ద్విచక్ర వాహనాల బ్రాండ్‌లతో పాటు ధరలను పెంచిన తయారీదారుల జాబితాలో అప్రిలియా కూడా వచ్చి చేరింది.  కమోడిటీ ధరల పెరుగుదల ఇంకా ఉత్పత్తి వ్యయం పెరగడంతో ద్విచక్ర వాహన తయారీదారులు గత 6 నెలలుగా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అప్రిలియా  మొత్తం లైనప్‌లో ధరల పెంపు జరిగింది. 

భవిష్యత్తులో అప్రిలియా బైక్స్ ధరలను కూడా పెంచే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుతం 660సీసీ, 1100సీసీ బైక్‌లను అందిస్తోంది. అప్రిలియా ప్రస్తుతం 125సీసీ, 160సీసీ  స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ  స్కూటర్ ధరలను రూ.6,276 నుంచి రూ.6,728కి పెంచింది. 

Latest Videos

undefined

కంపెనీ  అత్యంత బడ్జెట్ స్కూటర్ ఏప్రిలియా స్టార్మ్ డిస్క్ ధర ఇప్పుడు రూ. 1,06,331. అప్రిలియా  ఎస్‌ఆర్ ఆర్‌ఎస్‌టి 125  కొత్త ధర రూ. 6,428 పెరిగి రూ. 1,15,877 చేరింది. దీని తర్వాత అప్రిలియా ఎస్‌ఆర్ ఆర్‌ఎస్‌టి  160 (ఏప్రిలియా SR RST 160) రూ. 1,25,895 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది.

Aprilia SXR 125 కొత్త ధర రూ. 1,27,206, అంటే రూ. 6,549 పెరిగింది. అప్రిలియా SR RST కార్బన్ కొత్త ధర రూ. 1,28,406, అంటే రూ. 6,577 పెరిగింది. అప్రిలియా SR RST రేస్ ఇప్పుడు రూ. 6,657 పెరుగుదలతో రూ. 1,35,147కి అందుబాటులో ఉంది. అప్రిలియా SXR 160 ధర రూ. 6,728 పెరగడంతో దీని ధర రూ. 1,38,483 చేరింది.

ఇతర ద్విచక్ర వాహన తయారీదారులతో పోలిస్తే అప్రిలియా స్కూటర్ల ధర పెంపు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది  కస్టమర్ స్కూటర్ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. అంతేకాకుండా, ధరల పెంపు మినహా ఈ స్కూటర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్కెట్‌లోని దాని పోటీ స్కూటర్‌లతో పోల్చితే, అవి ఫీచర్లలో కూడా చాలా తక్కువ పొందుతాయి. 

click me!