ఎలక్ట్రిక్ వెర్షన్‌లో సుజుకి కొత్త స్కూటర్‌.. లాంచ్‌కు ముందే సమాచారం లీక్.. ఎలాంటి ఫీచర్స్ చూడొచ్చంటే..?

By asianet news telugu  |  First Published Mar 31, 2023, 4:48 PM IST

బర్గ్‌మ్యాన్ స్కూటర్‌ను సుజుకి మోటార్‌సైకిల్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో పరిచయం చేయనుంది. మీడియా కథనాల ప్రకారం, దీనికి సంబంధించి కొంత సమాచారం తెరపైకి వచ్చింది. ఈ సమాచారం ఏంటి, వాటి వివరాల గురించి తెలుసుకుందాం.


బర్గ్‌మ్యాన్ స్కూటర్‌ను జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావచ్చు. మీడియా కథనాల ప్రకారం, సంస్థ దీనిపై సన్నాహాలు చేస్తోంది. రిపోర్టుల ప్రకారం దీని క్వాలిటీస్ ఎలా ఉండొచ్చని చూద్దాం...

 ఎలక్ట్రిక్ వెర్షన్‌లో బర్గ్‌మాన్
బర్గ్‌మాన్  ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావచ్చు. కంపెనీ నుంచి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తొలి ఎలక్ట్రిక్ ఉత్పత్తి కూడా ఇదే కావచ్చు. అయితే కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

Latest Videos

undefined

డిజైన్ ఎలా ఉంటుందంటే 
ఇదే విధమైన డిజైన్  మార్కెట్లలో కూడా అందించబడుతుంది. ప్రస్తుత మోడల్ లాంటి అదే డిజైన్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా ఉంచవచ్చు.

ఫీచర్లు ఎలా ఉంటాయంటే 
ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మ్యాక్సీ స్టైల్ బాడీ వర్క్, స్పోర్టీ ఫాసియాతో కూడిన సైడ్ ప్యానెల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ ఇవ్వవచ్చు. అంతేకాకుండా, పెట్రోల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ బర్గ్‌మ్యాన్ బరువులో తేడా ఉండవచ్చు, ఎందుకంటే ఇంజిన్ స్థానంలో బ్యాటరీ అండ్ మోటారు ఇవ్వబడుతుంది. ఇంకా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో డ్యూయల్ రియర్ షాకబ్జర్ కూడా ఇవ్వవచ్చు.  

శక్తివంతమైన మోటర్ అండ్ బ్యాటరీ 
టెస్టింగ్ యూనిట్ గరిష్టంగా 4KW పవర్ అవుట్‌పుట్‌తో AC సింక్రోనస్ మోటార్‌తో అందించబడింది. దీనిని మార్చగల లిథియం అయాన్ బ్యాటరీతో జత చేయవచ్చు. 4 kW మోటార్ స్కూటర్‌కు 18 న్యూటన్ మీటర్ల టార్క్ ఇస్తుంది, ప్రస్తుతం దీనిని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో 44 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

పొడవు అండ్ వెడల్పు ఎంత
పొడవు 1825 ఎం‌ఎం ఉంటుంది. దీని వెడల్పు 765 ఎం‌ఎం, ఎత్తు 1140 ఎం‌ఎం ఉంటుంది. ఈ స్కూటర్ సీటు ఎత్తు 780 ఎం‌ఎం ఉంటుంది. దీని మొత్తం బరువు 147 కిలోల వరకు ఉంటుంది.

లాంచ్ ఎప్పుడంటే ?
 మీడియా నివేదికల ప్రకారం, దీనిని పరీక్షించిన తర్వాత జపాన్‌లో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఇతర మార్కెట్లలో కూడా ప్రవేశపెట్టబడుతుంది, ఇందులో భారతదేశం కూడా ఉంది.

click me!