ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ఆఫర్.. ఇప్పుడు ఎంత తక్కువ ధరకు లభిస్తుందంటే..?

Published : Mar 31, 2023, 01:18 PM IST
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ఆఫర్.. ఇప్పుడు ఎంత తక్కువ ధరకు లభిస్తుందంటే..?

సారాంశం

ఓలా S1 ప్రో ARAI ధృవీకరించబడిన రేంజ్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 180 కి.మీ ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్  వాస్తవ పరిధి దాదాపు 170 కి.మీలుగా చెప్పబడింది. S1 ప్రో 116 kmph టాప్ స్పీడ్ వెళ్లగలదు.

రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (ola electric)ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో పై లిమిటెడ్ పీరియడ్ వరకు రూ.10,000 తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇంతకుముందు, కంపెనీ మార్చి 18, 19 తేదీలలో వీకెండ్ ఆఫర్‌  ఇచ్చింది. ఇండియన్ మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.39 లక్షలు.

ఓలా S1 ప్రో అనేది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఫ్లాగ్‌షిప్ ప్రాడక్ట్ ఇంకా S1 ఎయిర్, S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల పైన ఉంటుంది.

పవర్ అండ్ టాప్ స్పీడ్ 
ఓలా S1 ప్రో ARAI ధృవీకరించబడిన రేంజ్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 180 కి.మీ ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్  వాస్తవ పరిధి దాదాపు 170 కి.మీలుగా చెప్పబడింది. S1 ప్రో 116 kmph టాప్ స్పీడ్ వెళ్లగలదు. కేవలం మూడు సెకన్లలో 0 నుండి 40 kmph వరకు స్పీడ్ చేయగలదు. 

 బ్యాటరీ అండ్ ఛార్జింగ్
Ola S1 ప్రో 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందింది, దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.

కలర్ ఆప్షన్స్ అండ్ పోటీ
Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 12 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్లో ఈ స్కూటర్ Ather 450X Gen 3, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

PREV
click me!

Recommended Stories

Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు