'మేక్ యువర్ ఓన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాయల్ ఎన్ఫీల్డ్

By Sandra Ashok KumarFirst Published Nov 19, 2019, 11:27 AM IST
Highlights

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మేక్ యువర్ ఓన్' అని పిలువబడే సరికొత్త  కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోటారుసైకిల్ బుక్  చేసిన వెంటనే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల పూర్తి పర్సనలైజేషన్ అందించడం దీని లక్ష్యం!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మేక్ యువర్ ఓన్' అనే ఒక పర్సనలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది వినియోగదారులు డీలర్‌షిప్‌లో యూనిట్ దగ్గర బైక్ బుక్ చేసేటప్పుడు వారి బైక్ పర్సనలైజేషన్ చేసుకోడానికి అనుమతిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మోటార్‌సైకిళ్లపై ఫ్యాక్టరీ అమర్చిన పరికరాలను అందిస్తుంది.

ఇది పరికరాలు హోమోలోగేట్ కూడా. వినియోగదారులకు వారి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల కోసం ప్రత్యేకమైన రూపాన్ని ఇంకా కొత్త అనుభూతిని సృష్టించడానికి  పర్సనలైజేషన్ అనుమతిస్తుంది. అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉపకరణాలకు రెండేళ్ల వరకు వారంటీ కూడా ఉంటుంది.

also read  టాటా మోటార్స్ తో లిథియం అర్బన్ ఒప్పందం :500 కార్లు ఆర్డర్

ఈ కొత్త కార్యక్రమం గురించి  రాయల్ ఎన్‌ఫీల్డ్ సిఇఒ మాట్లాడుతూ, "ఒకరి మోటార్‌సైకిల్‌ను పర్సనలైజేషన్ మరియు యాక్సెస్ చేయడం దాదాపు మోటార్‌సైకిలిస్ట్‌కు మంచి అనుభూతి. మా ఈ ప్రయాణంలో కొత్త ఆలోచనలు, ప్రారంభాలు తీసుకురావడానికి ఎల్లప్పుడూ ఎంతో కృషి చేస్తుంటాం.

మేక్ యువర్ ఓన్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్. మేక్ యువర్ ఓన్ తో, కొనుగోలుదారులు తమ మోటారుసైకిల్‌ బుకింగ్ దశలోనే కొన్ని సులభమైన దశల్లో బుక్ చేసుకోవచ్చు అలాగే నచ్చిన విధంగా అనుకూలీకరించవచ్చు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా కస్టమర్‌లు తమ బ్రాండ్‌తో మరింత సన్నిహితంగా పాల్గొనడానికి మరియు మరిన్ని కొత్త  ఆలోచనలు సృష్టించడానికి తోడ్పడతాయి.

also read  ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్‌లో చేరిన ఇండియన్...స్కూటర్

మా స్టోర్స్‌లో మా వినియోగదారులకు మరింత లీనమయ్యే అనుభవాన్ని కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము ".'మేక్ యువర్ ఓన్' పర్సనలైజేషన్   ప్రోగ్రామ్ రాయల్ ఎన్‌ఫీల్డ్  క్లాసిక్ 350 లో ప్రారంభమవుతుంది. తరువాత ఇతర మోడళ్లలో కూడా అందించాలనుకుంటుంది.

మొదటి దశలో  ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై మరియు పూణేలోని 6 నగరాల్లో 141 స్టోర్ లలో 'మేక్ యువర్ ఓన్' కార్యక్రమం ప్రారంభం కానుంది.ఆఫర్‌లో ఉన్న బైక్ భాగాలు  ఇంజిన్ గార్డ్‌లు, పానియర్స్, వెనుక లాగేజ్ ర్యాక్, టూరింగ్ సీట్ ఎంచుకోవడానికి ఉన్నాయి. ARAI కంప్లైంట్ అల్లాయ్ వీల్స్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్ స్టిక్కర్ల అందుబాటులో ఉంటాయి.
 

click me!