చౌక ధరకే ‘క్లాసిక్ 350 ఎస్’తో విపణిలోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

By telugu teamFirst Published Sep 17, 2019, 12:10 PM IST
Highlights

ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ విపణిలోకి ‘క్లాసిక్ 350 ఎస్’ బైక్ ఆవిష్కరించింది. ఇంతకుముందు మోడల్ క్లాస్ 350 బైక్‌తో పోలిస్తే తక్కువ ధరకే రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ లభించనున్నది. ఇంతకుముందు దక్షిణాదికే పరిమితమైన రాయల్ ఎన్ ఫీల్డ్ ఇకముందు దేశమంతటా విస్తరించనున్నది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రైడింగ్ చాలా రాయల్‌గా ఉంటుంది. దాని సామర్థ్యం, అందులో గల ఫీచర్లను ద్రుష్టిలో పెట్టుకుంటే కాసింత వెనుకాముందు ఆలోచించాల్సిందే. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ తన వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలో ఒక కొత్త మోడల్ బైక్‌ను ఆవిష్కరించింది. 

ఆ మోడల్ బైక్ ‘క్లాసిక్ 350’ పేరుతో సోమవారం విపణిలోకి వచ్చింది. ఈ  బైక్‌ ధరను రూ.1.45 లక్షలుగా నిర్ణయించింది నిర్ణయించింది రాయల్ ఎన్ ఫీల్డ్.  క్లాసిక్ 350 లా డ్యూయల్-ఛానల్  ఏబీస్‌ మాదిరిగా కాకుండా క్లాసిక్ 350 ఎస్ లోని 'ఎస్' సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ను సూచిస్తుంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ బైక్ 350 ధర రూ .1.54 లక్షల ధరతో పోలిస్తే  కొత్త క్లాసిక్‌ 350 ఎస్‌ వెర్షన్‌ రూ.9 వేలు తక్కువకే లభిస్తుండటం గమనార్హం. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ బైక్ డిజైన్‌లోమార్పులు చేసినా, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ అదే 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో విపణిలోకి వస్తున్నది. 

5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో  ఇది 5,250 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 19.8 బిహెచ్‌పి,  4,000 ఆర్‌పీఎం వద్ద 28 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను అమరిస్తే, బ్యాక్ ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.

క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో ఇప్పుడు డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది. ఇది ప్యూర్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దక్షిణ భారత రాష్ట్రాల ప్రజలకు మాత్రమే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పరిమితం.

కానీ దేశంలోని ఇతర ప్రాంతాల్లోని వినియోగదారుల్లోకి అందుబాటులోకి రానున్నది. అంతటితో ఆగకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ విపణిలోకి కర్బన ఉద్గారాల నియంత్రణకు బీఎస్-6 ప్రమాణాలతో క్లాసిక్ 350 ఎస్ పేరిట నూతన తరం బైక్‌ను విపణిలోకి విడుదల చేస్తోంది. 

click me!