హోండా అమేజ్ కారుపై దాదాపు రూ.42వేల తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానిలో కార్ ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.30వేలు, ఎక్స్ టెండెడ్ వారెంటీ కింద రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వినియోగదారులు కార్ ఎక్స్ఛేంజ్ చేసుకోకుండా.. రూ.16వేలు విలువచేసే మొయింట్ నెన్స్ ప్రోగ్రామ్ ని మూడు సంవత్సరాల పాటు అందించనున్నారు.
పండగల వేళ... జపాన్ కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు హోండా సరికొత్త ఆఫర్ల బొనాంజాను మన ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయి, టయోటాలు భారీ ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా హోండా కూడా ఆఫర్లను తీసుకువచ్చింది. భారత్ లో తమ సంస్థకు సంబంధించిన పలు కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రత్యేకించి కొన్ని మోడళ్ల కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. హోండా సివిక్, హోండా సీఆర్-వీ కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. హోండా అమేజ్ ధర కూడా తగ్గించారు.గతేడాది హోండా అమేజ్ కారు ఎక్కువగా అమ్ముడయ్యింది. కాగా... దానిపై స్పెషల్ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.
హోండా అమేజ్ కారుపై దాదాపు రూ.42వేల తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానిలో కార్ ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.30వేలు, ఎక్స్ టెండెడ్ వారెంటీ కింద రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వినియోగదారులు కార్ ఎక్స్ఛేంజ్ చేసుకోకుండా.. రూ.16వేలు విలువచేసే మొయింట్ నెన్స్ ప్రోగ్రామ్ ని మూడు సంవత్సరాల పాటు అందించనున్నారు.
హోండా జాజ్ కి రూ.25వేల తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరో 25వేలు.. మొత్తం రూ.50వేల తగ్గింపు ప్రకటిస్తున్నారు. హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ కారుకి మొత్తంగా రూ.45వేల తగ్గింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. హోండా సిటీ మోడల్ కారు పై రూ.62వేలు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు.
హోండా బీఆర్-వీ మోడల్ కారు మీద రూ.1.10లక్షల బెనిఫిట్స్, హోండా సీవిక్ మోడల్ కారు మీద రూ.2.5లక్షల బెనిఫిట్స్, ఇక హోండా సీఆర్-వీ మోడల్ కారు కి అయితే ఏకంగా రూ.4లక్షల వరకు బెనిఫిట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.