మార్కెట్లో బీఎస్-6 వెహికల్స్ హల్‌చల్...తాజాగా కొత్త.. క్లాసిక్ స్కూటీస్..

By Sandra Ashok Kumar  |  First Published Nov 28, 2019, 12:44 PM IST

మార్కెట్లో బీఎస్-6 వెహికల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా టీవీఎస్ మోటార్స్ ‘జ్యూపిటర్ క్లాసిక్’ స్కూటీలను ఆవిష్కరించింది.తాజాగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త జూపిటర్‌ క్లాసిక్‌ ఈటీ-ఎఫ్‌ఐ మోడల్‌ స్కూటీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.67,911గా నిర్ణయించింది.


న్యూఢిల్లీ:  బీఎస్‌ -6  బైక్స్‌  మార్కెట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇతర ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో పాటు, తాజాగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త జూపిటర్‌ క్లాసిక్‌ ఈటీ-ఎఫ్‌ఐ మోడల్‌ స్కూటీని మార్కెట్లోకి విడుదల చేసింది.ఆర్‌టీ-ఎఫ్‌ఐ (రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్), ఈటీ-ఎఫ్‌ఐ (ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీ అనే రెండు వెర్షన్లను డెవలప్‌ చేసినా, ప్రస్తుతం  ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీని పరిచయం చేసింది.

also read హోండా సిటీ న్యూ మోడల్ ...లాంచ్ ఎప్పుడంటే ?

Latest Videos

ఈ స్కూటర్‌ ధరను రూ. 67,911గా టీవీఎస్ మోటార్స్ నిర్ణయించింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలను అందుకోవడంలో భాగంగా దీన్ని బుధవారం లాంచ్‌ చేసింది. బీఎస్‌-6 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీ మెరుగైన పనితీరు, అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త జూపిటర్‌ క్లాసిక్‌ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని పేర్కొంది.

జూపిటర్ క్లాసిక్‌లో 110 సీసీ బీఎస్‌-6 ఇంజిన్‌తోపాటు ఫ్రంట్ ప్యానెల్‌లో మొబైల్‌  కోసం ప్లేస్‌, యుఎస్‌బీ ఛార్జర్‌, టిన్‌టెడ్‌ విండ్‌స్ర్కీన్‌ వంటి ఫీచర్లను జోడించారు. ఇది 7500 ఆర్‌పీఎం వద్ద 7.9 బీహెచ్‌పీ శక్తిని, 5500 ఆర్‌పీఎం వద్ద 8ఎన్‌ఎం టార్చిని ఉత్పత్తి చేస్తుంది. 

also read  బీఎస్-6 స్టాండర్డ్‌తో టీవీఎస్ అపాచీ బైక్స్ రెడీ.. బట్ ధరెంతంటే ?

‘ఈటీ-ఎఫ్‌ఐ టెక్నాలజీని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాం. జూపిటర్ క్లాసిక్‌ ఈటీ-ఎఫ్‌ఐ అధిక మైలేజీతోపాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంద’ని టీవీఎస్ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్ అనిరుధ్‌ హల్దార్‌ తెలిపారు.
 

click me!