Ethanol fuel: ఇథనాల్ ఫ్యూయెల్ ధర పెట్రోల్ ధరలో సగం.. ఎలాంటి ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి..

By asianet news telugu  |  First Published Jul 29, 2022, 5:01 PM IST

 క్యాలరీ వాల్యు ఇంధనం  ఒక యూనిట్ పూర్తిగా కాలిపోయినప్పుడు ఉత్పత్తి చేయబడిన శక్తి (వేడి) మొత్తాన్ని సూచిస్తుంది. ఇథనాల్ ఆధారిత ఇంధనం ఆధునిక కార్లకు శక్తినివ్వగలదని నిర్ధారించడానికి, దాని కెలోరిఫిక్ విలువ తప్పనిసరిగా పెట్రోల్‌తో సమానంగా ఉండాలి. 


కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫ్యూయెల్ ఉపయోగించడం వల్ల వివిధ ప్రయోజనాలను విశ్వసిస్తున్నారు. భారతదేశం ముడి చమురు దిగుమతి బిల్లును గణనీయంగా తగ్గించుకోగలదని ఆయన చెప్పారు. ఇథనాల్ ఆధారిత ఇంధనాన్ని స్వీకరించడం పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుందని,  ఇది వినియోగదారునికి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. తాజాగా ఓ మీడియా ఈవెంట్‌లో మాట్లాడిన గడ్కరీ.. పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంలో ఉండే క్యాలరీ వాల్యు సమానంగా ఉండేలా చూసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 

 క్యాలరీ వాల్యు ఇంధనం  ఒక యూనిట్ పూర్తిగా కాలిపోయినప్పుడు ఉత్పత్తి చేయబడిన శక్తి (వేడి) మొత్తాన్ని సూచిస్తుంది. ఇథనాల్ ఆధారిత ఇంధనం ఆధునిక కార్లకు శక్తినివ్వగలదని నిర్ధారించడానికి, దాని కెలోరిఫిక్ విలువ తప్పనిసరిగా పెట్రోల్‌తో సమానంగా ఉండాలి. 

Latest Videos

undefined

రష్యాకు సాంకేతిక పరిజ్ఞానం ఉందని, భారత్‌లో  అధికారులు ఇప్పుడు ఆ దిశగా పనిచేస్తున్నారని నితిన్ గడ్కరీ చెప్పారు. "పెట్రోలు ఆవరేజ్ మైలేజీ ఇథనాల్‌తో సమానంగా ఉండే అవకాశం ఉందని వారు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు) అండ్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ అంగీకరించింది" అని ఆయన చెప్పారు. అలాగే ఇథనాల్‌ను ఉత్తరప్రదేశ్‌, తమిళనాడులో తయారు చేస్తున్నామని, ఇథనాల్‌ ఇంధన కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, ఐదేళ్లలో పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా మారుతుందని గడ్కరీ చెప్పారు. 

కేవలం పెట్రోల్ మోడల్‌లో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ వాహనంలో ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించినప్పుడు ఖర్చు ప్రయోజనాలను గడ్కరీ ఎత్తి చూపారు. పెట్రోలు ధర రూ.120 (లీటర్‌కు), ఇథనాల్ రూ.62. సగం ధరకే అదే క్యాలరీ వాల్యు లభిస్తుందని, కాబట్టి పెట్రోలు అవసరం లేదని ఆయన వివరించారు. 

ప్రపంచంలోని అత్యంత కలుషితమైన నగరాలు ఉన్న దేశంలో ఉద్గారాలు ఒక ముఖ్యమైన అంశం. అనేక అధ్యయనాలు ఇథనాల్, ఇథనాల్-పెట్రోల్ మిశ్రమాలు క్లీన్ బర్నర్స్ అని నిరూపించాయి. అందువల్ల పెట్రోల్ కంటే చాలా తక్కువ కాలుష్యం కలిగిస్తుంది. ఇథనాల్‌కు ఇది మరో ప్రయోజనమని, ఇంధన ప్రత్యామ్నాయాన్ని భారీగా ఉపయోగించడం వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో చాలా దోహదపడుతుందని గడ్కరీ అన్నారు.
 

click me!