Volkswagen Polo:త్వరలో పోలో హ్యాచ్‌బ్యాక్ కారుకి బై బై.. ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటన..

By asianet news telugu  |  First Published Apr 8, 2022, 1:22 PM IST

పోలో 12 సంవత్సరాల సక్సెస్ పురస్కరించుకుని వోక్స్‌వ్యాగన్ ఈ వారం ప్రారంభంలో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. దీనికి పోలో లెజెండ్ ఎడిషన్ అని పేరు పెట్టారు. 


వోక్స్‌వ్యాగన్ పోలో త్వరలో భారతదేశంలో ఉత్పత్తి నిలిపివేయనుంది. ఇకపై దేశంలో పోలో ఉత్పత్తి ఉండదని జర్మన్ కార్ల తయారీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ని 2009లో భారతదేశంలో మొదటిసారిగా ప్రారంభించారు, అయితే ఇండియాలో వోక్స్‌వ్యాగన్ అత్యంత విజయవంతమైన మోడల్‌లలో ఒకటి. 

ఈ విషయాన్ని ఫోక్స్‌వ్యాగన్ గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. గత 12 సంవత్సరాలుగా భారతదేశంలో పోలో విజయమైన తర్వాత  ఈ  ప్రకటన వ్యక్తిగతంగా కనిపిస్తోంది. "12 సంవత్సరాల నిరంతర విజయం తర్వాత, ఇప్పుడు ఉత్పత్తికి బ్రేక్‌లు వేయాల్సిన సమయం వచ్చింది" అని ప్రకటనలో పేర్కొంది. 

Latest Videos

undefined

పోలో 12 సంవత్సరాల సక్సెస్ పురస్కరించుకుని వోక్స్‌వ్యాగన్ ఈ వారం ప్రారంభంలో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. దీనికి పోలో లెజెండ్ ఎడిషన్ అని పేరు పెట్టారు. పోలో లెజెండ్ ని పూణే సమీపంలోని కార్ల తయారీ సంస్థ చకాన్ ప్లాంట్ నుండి హ్యాచ్‌బ్యాక్ కారు చివరి ఉత్పత్తి యూనిట్ అవుతుంది. 

వోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, "వోక్స్‌వ్యాగన్ పోలో అనేది కస్టమర్ల మధ్య చాలా భావోద్వేగాలను సృష్టించిన ఒక ఐకానిక్ కార్ లైన్. దీనిని మార్కెట్‌లో ప్రారంభించినప్పటి నుండి వోక్స్‌వ్యాగన్ పోలో  ఫ్యామిలీ మొదటి కారుగా ఉద్భవించింది, ఔత్సాహికుల కల,  స్లిక్ ఇంకా స్పోర్టీ డిజైన్, సేఫ్టీ, ఫన్-టు-డ్రైవ్ అనుభవం, దృఢమైన నిర్మాణ నాణ్యత కోసం బెస్ట్ ఆప్షన్.

700 యూనిట్లు మాత్రమే
వోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్‌ను హ్యాచ్‌బ్యాక్  జి‌టి టి‌ఎస్‌ఐ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్‌ని కంపెనీ కేవలం 700 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.10.25 లక్షలుగా నిర్ణయించింది.

ఇంజిన్ అండ్ పవర్
వోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ 1.0-లీటర్ 3-సిలిండర్ టి‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తున్నారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో  వస్తుంది. ఈ ఇంజన్ 110 PS పవర్ అండ్ 175 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్  పవర్ అవుట్‌పుట్  ఇతర వేరియంట్‌ల లాగానే ఉంటుంది. 

4-స్టార్ సేఫ్టీ రేటింగ్
భారతదేశంలో పోలో హ్యాచ్‌బ్యాక్ ని 2009లో ఉత్పత్తిని ప్రారంభించి 2010లో  లాంచ్ చేశారు. నేటికి 12 సంవత్సరాల వసంతాలు జరుపుకుంటోంది. పోలో  పూణేలోని చకన్ ప్లాంట్‌లో ఫోక్స్‌వ్యాగన్  మొట్టమొదటి స్థానికంగా తయారు చేయబడిన మోడల్. అప్పటి నుండి పోలోకు భారతదేశంలో 3 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఫోక్స్‌వ్యాగన్ పోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తూ ఈ విభాగంలోని మొదటి మేడ్-ఇన్-ఇండియా హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఇంకా ఈ కారు 2014లో 4-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

click me!