ఈ కొత్త కారుకు జనం దూరం, 61 శాతం పడిపోయిన అమ్మకాలు, షాక్‌లో కంపెనీ !

By asianet news telugu  |  First Published Nov 9, 2023, 6:42 PM IST

అక్టోబర్ 2023 నాటికి టాటా పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ SUV అత్యధికంగా అమ్ముడైన కారు. అంతేకాదు ఈ SUV విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVగా కూడా మారింది. అయితే టాటా నుంచి వస్తున్న మరో వార్త చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
 


ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా నెక్సాన్ SUV మార్కెట్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. అక్టోబర్ 2023లో నెక్సన్ రికార్డ్ బ్రేకింగ్ అమ్మకాలను సాధించింది. అక్టోబర్ 2023 నాటికి టాటా పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ SUV అత్యధికంగా అమ్ముడైన కారుగా ఉంది. అంతేకాదు, SUV విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVగా కూడా మారింది. అయితే టాటా నుంచి వస్తున్న మరో వార్త చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

కొనుగోలుదారులు లేకపోవడంతో టాటాకు చెందిన టిగోర్ భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం  ప్రజలు ఈ కారును కొనేందుకు తిరస్కరించడంతో అక్టోబర్ 2023లో అమ్మకాలు 61 శాతం పడిపోయాయి. దింతో టిగోర్ విక్రయాల్లో వరుసగా మూడో నెల క్షీణతను నమోదు చేసింది. 

Latest Videos

undefined

టాటా టిగోర్ సేల్స్ - ప్రతి నెల అమ్మకాల వివరాలు
 మే 2023 - 2,701 
జూన్ 2023 - 3,335 
జూలై 2023 - 8,982
ఆగస్టు 2023 - 2,947
సెప్టెంబర్ 2023 - 1,534
అక్టోబర్ 2023 -1,563 

టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ గత నెలలో 1,563 యూనిట్ల అమ్మకాలతో ఆరవ స్థానంలో ఉంది, అయితే టాటా టిగోర్ 2022లో ఇదే కాలంలో 4,001 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇప్పుడు 61 శాతం క్షీణతను చూసింది. టాటా టిగోర్ అమ్మకాలు ఎలా తగ్గుముఖం పడుతున్నాయో పై చార్ట్ చూపిస్తుంది.

టాటా టిగోర్ భారత మార్కెట్లో హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి స్విఫ్ట్‌లకు పోటీగా ఉంది. అయితే, మిగతా మూడు కార్లతో (హ్యుందాయ్ ఔరా, మారుతి సుజుకి డిజైర్ అండ్  మారుతి సుజుకి స్విఫ్ట్) పోల్చితే టాటా టిగోర్ అమ్మకాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. 

 టాటా మోటార్స్ టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్  ఇతర మోడళ్ల కోసం  మార్పును ప్లాన్ చేస్తున్నట్లు కూడా నివేదికలు ఉన్నాయి. కొత్త టాటా టిగోర్ అల్ట్రాజ్ నుండి తీసుకోబడిన ఆల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. 2024 టాటా టిగోర్ గురించి వివరాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ డిజైన్‌లో ఇంకా మరింత ఉన్నత స్థాయి ఇంటీరియర్‌లో ముఖ్యమైన అప్‌డేట్‌ ఉంటుందని భావిస్తున్నారు.

click me!