Latest Videos

17 లక్షల బైక్ నడుపుతున్న జొమాటో డెలివరీ బాయ్... నెటిజన్లకు షాక్ ఇచ్చిన వైరల్ వీడియో.. కారణం..?

By asianet news teluguFirst Published Nov 3, 2023, 5:03 PM IST
Highlights

ఈ వీడియోలో జొమాటో డెలివరీ ఏజెంట్ రూ. 17 లక్షల సుజుకి హయాబుసా బైక్‌పై ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లడం చూడవచ్చు.
 

రూ.17 లక్షల సుజుకీ హయబుసా బైక్‌పై ఓ యువకుడు ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్నది ఎవరు..? ఇంత ఖరీదైన బైక్ ఉన్న వ్యక్తి ఫుడ్ డెలివరీ వర్క్ ఎందుకు చేస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు...

సోషల్ మీడియాలో ఇలాంటి వింత పోస్టులు పెట్టి ఫేమస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. తమకు వచ్చిన ఫెమ్  ఉపయోగించుకుని క్రమంగా కోట్లకు చేరుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కొందరు నెటిజన్ల పాపులారిటీని సినిమా ఎంట్రీ టిక్కెట్‌గా కూడా మార్చుకుంటారు.

 HSB అఫీషియల్ Instagram పేజీలో ఒక వీడియో రిలీజ్ చేయబడింది. 17 లక్షల విలువైన సుజుకీ హయాబుసా బైక్‌పై జొమాటో కంపెనీకి చెందిన డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. బైక్ వెనుక ఫుడ్ డెలివరీ కోసం ఒక పెద్ద బ్యాగ్ కూడా కనిపిస్తుంది.

లక్షల విలువైన బైక్ నడుపుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోలోని సుజుకి హయాబుసా బైక్ యజమాని HSB అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీని నడుపుతున్న హర్ ప్రీత్ సింగ్ అని ఇంకా ఈ వీడియో ఢిల్లీలో రికార్డ్ చేసినట్లు వెల్లడైంది.

అయితే హెల్మెట్ లేకుండా తలపాగా వేసుకుని బైక్ నడుపుతున్నదెవరో తెలియదు. ఈ బైక్‌ను మరెవరైనా వీడియో తీశారా లేదా అనే విషయాన్ని హర్ ప్రీత్ తెలపలేదు. అయితే  ఈ వివరాలు తెలియకపోయినా.. ఈ ఆశ్చర్యమైన వీడియో  మాత్రం నెటిజన్లకే పరిమితం కాలేదు.

గత వారం ఇండోర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వీడియోలో రోడ్డుపై జొమాటో లోగో ఉన్న జెర్సీని ధరించి ఒక మహిళ యమహా R15 బైక్ నడిపింది.

click me!