ఈ కారు ధర వింటేనే కళ్లు బైర్లుగమ్మడం ఖాయం, ఎంతో తెలుసా?

First Published 24, Jul 2018, 4:42 PM IST
Highlights

కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు తమ కార్లను స్టేటస్ సింబల్ వాడుతుంటారు. అందుకే ఎంత ఎక్కువ ధర కల్గిన కారునైనా కొనాలనుకుంటారు. అందుకోసం అస్సలు వెనుకాడరు. అయితే ఇలాంటి వారికోసమే ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పగానీ ఓ సూఫర్ కారుని డిజైన్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఆ కారు ధర ఏ పదో, పాతిక కోట్లో అనుకుంటే మీరు పొరపడినట్లే. అక్షరాలా ఆ కారు ధర రూ.121 కోట్లు.

ఇటలీకి చెందిన ఈ సంస్థ విలాసవంతమైన మరియు స్పోర్ట్స్ కార్లను తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ నుండి ఇప్పటికే జోండా, హుయైరా వంటి కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇవన్నీ బాగా ఖరీదైన కార్లే. అయితే తాజాగా ఈ కంపెనీ జోండా బ్రాండ్ లోనే ''జోండా హెచ్‌పీ బార్షెటా'' కారుని తయారుచేసింది. అయితే దీని ధరను మాత్రం ఏకంగా రూ.121 కోట్లుగా నిర్ణయించింది.

అయితే ఈ కార్లను కేవలం మూడింటిని మాత్రమే ఈ సంస్థ తయారుచేసింది. ఇప్పటికే ఈ మూడు కార్లు అమ్ముడవటం కూడా జరిగింది. ఇలా ప్రంపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా, వేగంగా అమ్ముడుపోయిన ఖరీదైన కార్లుగా ఇవీ రికార్డు సృష్టించాయి.

Last Updated 24, Jul 2018, 4:42 PM IST