ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రాడ్‌తో కోపాన్ని వెళ్లగక్కిన కస్టమర్.. ఎందుకు ఇలా చేసాడో తెలుసుకోండి..

By asianet news telugu  |  First Published Nov 17, 2023, 5:47 PM IST

వీడియోలో చూసినట్లయితే  ఓ వ్యక్తి కోపంతో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని  ఉద్దేశపూర్వకంగా కొట్టడం చూడవచ్చు.  కంపెనీ  ఉత్పత్తులపై దాడి చేయడంతో  వేళ్లు చూపుతున్న ప్రజలకు కంపెనీ కస్టమర్లకు హాని కలిగించేల భావిస్తున్నాయని కోపంగా చెప్పడం వినవచ్చు. 


ఓలా ఎలక్ట్రిక్ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీలలో ఒకటి. అయినప్పటికీ కంపెనీ ఉత్పత్తులకు సంబంధించిన వివాదాల బారిన పడకుండా లేదు. ఓలా S1 సిరీస్ EV ప్రారంభించినప్పటి నుండి చాలా మంది కస్టమర్లు ఉత్పత్తితో ఎన్నో  రకాల సమస్యలను నివేదించారు. ఈ విషయంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతం ఇదోకటి. ఒక కస్టమర్ తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రాడ్‌తో కొట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తాజాగా ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.  

వీడియోలో చూసినట్లయితే  ఓ వ్యక్తి కోపంతో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని  ఉద్దేశపూర్వకంగా కొట్టడం చూడవచ్చు.  కంపెనీ  ఉత్పత్తులపై దాడి చేయడంతో  వేళ్లు చూపుతున్న ప్రజలకు కంపెనీ కస్టమర్లకు హాని కలిగించేల భావిస్తున్నాయని కోపంగా చెప్పడం వినవచ్చు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి  స్కూటర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ అండ్  సైడ్ మిర్రర్‌ను రాడ్‌తో కొట్టి    పగలగొట్టడం  స్పష్టమైన నష్టాన్ని చూపుతుంది. 

Latest Videos

undefined

ఈ ఘటన వెనుక ఉన్న  సరైన  కారణాన్ని చెప్పలేనప్పటికీ  కోపంతో ఉన్న కస్టమర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కదులుతున్నప్పుడు దానంతటదే స్పీడ్  కావడం ప్రారంభించిందని, తన  భద్రతను ప్రమాదంలో పడేసినట్లు పేర్కొన్నాడు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు వ్యాపించడం ఇతర సాంకేతిక లోపాలు జరగడం కూడా వెలుగులోకి వచ్చ్చాయి. వీటికి అదనంగా,   సాఫ్ట్‌వేర్ బగ్ కారణంగా కస్టమర్‌లు భద్రతా సమస్యలను ఎత్తి చూపిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో స్కూటర్ ఒక్కసారిగా రివర్స్‌లో కదలడం ప్రారంభించింది.

బెంగళూరుకు చెందిన   ఎలక్ట్రిక్ వాహన  తయారీ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలలో అగ్రగామిగా ఉంది. ఎందుకంటే ప్రతి నెలా ఈ విభాగం బాగా  పాపులారిటీ పొందుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో FAME-II సబ్సిడీలలో కోత కారణంగా తాత్కాలిక మందగమనం ఉన్నప్పటికీ, EV ద్విచక్ర వాహనాల అమ్మకాలు కొంత క్షీణతను నమోదు చేశాయి. ప్రస్తుత పండుగ సీజన్‌కు ముందు అమ్మకాలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 

click me!