'మేము ఏదో.. సమయంలో విడిపోయినట్లు కనిపిస్తోంది': ఆనంద్ మహీంద్రా వైరల్ రిప్లయ్.. నెటిజన్లు షాక్..

By asianet news telugu  |  First Published Nov 14, 2023, 4:53 PM IST

ఒక యూజర్ పోస్ట్‌పై "మా చిన్నతనంలో మేం ఏదో మేళా సమయంలో విడిపోయినట్లు కనిపిస్తోంది," ఆంటూ మహీంద్రా రిట్వీట్ చేసారు. ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఫోటో పూణే నుండి తన సహోద్యోగి  ఫోటో. 
 


మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మంగళవారం  X(ట్విట్టర్) లో తనను పోలిన వ్యక్తి  ఫోటో పోస్ట్‌పై స్పందించారు దింతో  అతని రిట్వీట్ వైరల్‌గా మారింది.

 @pjdaddyofficial పేరుతో ఉన్న ఒక యూజర్ పోస్ట్‌పై "మా చిన్నతనంలో మేం ఏదో మేళా సమయంలో విడిపోయినట్లు కనిపిస్తోంది," ఆంటూ మహీంద్రా రిట్వీట్ చేసారు. ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఫోటో పూణే నుండి తన సహోద్యోగి  ఫోటో. 

Latest Videos

“@anandmahindra మీరు కూడా ఈ వ్యక్తిని చూసిన తర్వాత షాక్ అవుతారు. తను పూణేకి చెందిన నా సహోద్యోగి, ఆనంద్ మహీంద్రా లాగా ఉన్నాడు" అని ఫోటోతో పాటు ఓ యూజర్ పోస్ట్  చేసారు.

చాలా మంది X యూజర్లు అద్భుతమైన ఈ పోలికను ఎత్తి చూపారు ఇంకా అతను, ఆనంద్ మహీంద్రా ఒకేలాగా   కనిపిస్తున్నారని కామెంట్ చేసారు.

“అద్భుతమైన పోలిక” అని ఒకరు, మరొకరు “ఐడెంటికల్ ట్విన్స్?” అని ఇంకొకరు “అతను మహీంద్రా ఆనంద్ కాదా?” అంటూ రీట్వీట్  చేసారు. ఒకరైతే "అతను కోర్టుకు వెళితే, అతను మీ సోదరుడు కాదని మీరు నిరూపించాలి 😂" అని పోస్ట్ పై  ట్వీట్ చేసారు. 

"ఎక్కువగా ప్రజలు వారిలాగే కనిపించే  మరొకరిని చూడరు. మానవ ముఖం అసాధారణంగా ప్రత్యేకమైనది, ”అని ఒక యూజర్ అనగా.... "మన్మోహన్ దేశాయ్ బ్లాక్ బస్టర్ కోసం పర్ఫెక్ట్ ప్లాట్" అని మరొకరు అన్నారు.   

 మహీంద్రా ఇటీవల వీల్‌ చైర్ వారి కోసం కష్టమైజెడ్  కారు డిజైన్‌ను ఆకట్టుకునేలా కనుగొంది. "సూపర్ స్మార్ట్ ఇంకా  సూపర్ ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్‌మెంట్‌లను అందించగలిగితే అది నన్ను గర్వంగా చేస్తుంది. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన ఆటో OEMకి అలా చేయడం కష్టం. మాకు కష్టమైజెషన్  లో నిమగ్నమైన స్టార్టప్ అవసరం. నేను ఇష్టపూర్వకంగా పెట్టుబడి పెడతాను. అలాంటి స్టార్టప్" అని వీడియోను షేర్ చేస్తూ రాశాడు.

వీల్ చైర్ వారు సులభంగా వాహనంలోకి ఎక్కడానికి,   దిగడానికి   కారు వైపు నుండి పొడిగించగల ర్యాంప్ డిజైన్‌  ఉంది. ఈ కారులో వీల్‌చైర్లు అలాగే  ఇతర మొబిలిటీ పరికరాల కోసం ఎక్కువ స్థలంతో పాటు మోడిఫైడ్  ఇంటీరియర్ కూడా ఉంది.

click me!