నివేదికల ప్రకారం, హ్యుందాయ్ నుండి కొత్త ఎస్‌యూవి వచ్చే ఏడాది ఫెస్టివల్ సీజన్‌లోపు భారత మార్కెట్లోకి తీసుకురావచ్చు. కానీ జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రవేశపెట్టవచ్చు.
దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీని తీసుకొచేందుకు సన్నాహాలు చేస్తుంది. మీడియా నివేదికల ప్రకారం ఈ కొత్త ఎస్‌యూవి నాలుగు మీటర్ల కంటే తక్కువ సైజ్ లో ఉంటుంది. అంతేకాదు ఈ కారు టాటా, మారుతి వంటి కంపెనీల కార్లతో పోటీనగా నిలుస్తుంది.
కొత్త ఎస్‌యూవి
మీడియా నివేదికల ప్రకారం, త్వరలో మరో ఎస్‌యూవి భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ కారు నాలుగు మీటర్ల కంటే చిన్నగా ఉంటుంది అలాగే చాలా పవర్ ఫుల్ ఫీచర్లతో రానుంది. నివేదికల ప్రకారం, కంపెనీ దీనికి AI3 అనే కోడ్‌నేమ్ ఇచ్చింది. అయితే, లాంచ్ సమయంలో దీని పేరు ఏంటి అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.
AI3 ఎస్‌యూవి ఎప్పుడు వస్తుంది?
నివేదికల ప్రకారం, హ్యుందాయ్ నుండి కొత్త ఎస్‌యూవి వచ్చే ఏడాది ఫెస్టివల్ సీజన్‌లోపు భారత మార్కెట్లోకి తీసుకురావచ్చు. కానీ జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రవేశపెట్టవచ్చు. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద కంపెనీలు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
ఇంజిన్ ఎలా ఉంటుందంటే
మీడియా నివేదికల ప్రకారం ఈ చిన్న SUVలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించవచ్చు. ఈ ఇంజన్ కంపెనీ హ్యాచ్‌బ్యాక్ ఐ-10 నియోస్‌లో అందించారు. దీనితో పాటు టర్బో ఇంజిన్ ఆప్షన్ కూడా ఇందులో ఇవ్వవచ్చు. కంపెనీ కొత్త SUVని ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో అందించవచ్చు.
కాంపిటేషన్
ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు అధిక డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లోని చాలా రకాల స్పెషాలిటీలను కస్టమర్లు ఇష్టపడుతున్నారు. ఈ SUV భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న టాటా పంచ్ అండ్ మారుతి S Preso వంటి వంటి కార్లకు పోటీగా వస్తుంది. దీనితో పాటు ఈ SUV రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్‌లను కూడా పోటీగా నిలుస్తుంది