కొత్త ప్రధానమంత్రి అరుదైన కార్ కలెక్షన్: బుల్లెట్లు, ల్యాండ్‌మైన్‌లు కూడా ఏం చేయలేవు..

By asianet news teluguFirst Published Nov 3, 2022, 9:39 AM IST
Highlights

యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త  ప్రధాన మంత్రి మల్టీ రేంజ్ రోవర్ ఎస్‌యూ‌విలు, ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో కూడిన కాన్వాయ్‌లో రిషి సునాక్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకోవడం తాజాగా కనిపించింది. 

భారతీయ సంతతికి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మొదటి ప్రధాన మంత్రి రిషి సునక్ కొద్దిరోజులుగా ముఖ్యాంశాలలో నిలుస్తున్నారు.  ఆటోమోటివ్ గురించి మాట్లాడుకుందాం రిషి సునక్‌కి ఈ విషయంలో కూడా మంచి టెస్ట్ ఉంది.  మల్టీ రేంజ్ రోవర్ ఎస్‌యూ‌విలు, ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో కూడిన కాన్వాయ్‌లో రిషి  సునాక్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకోవడం కనిపించింది. అయితే అతని కుటుంబానికి వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కూడా ఉందని తెలిసింది. అంతేకాకుండా రిషి సునక్ కుటుంబానికి మరో మూడు వాహనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి బెస్ట్ బ్రిటిష్ లగ్జరీ కార్ ఇంకా, USAలోని కాలిఫోర్నియాలోని ఇంట్లో  టాప్-స్పెక్ లెక్సస్ ఎస్‌యూ‌వి అండ్ బి‌ఎం‌డబల్యూ  ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్
భూమిపై ఉన్న అత్యంత ధనవంతులలో ఒకరైన రిషి సునక్ మొదటి కారు వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్. రిషి సునాక్ గోల్ఫ్ కార్ బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఈ కారుని సాధారణ ప్రయాణాల కోసం ఉపయోగిస్తాడు. ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ గురించి చెప్పాలంటే ఐరోపాలో అత్యంత సరసమైన కార్లలో ఒకటి ఇంకా ప్రజల కోసం రూపొందించబడింది.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ సెంటినల్
రిషి సునక్ ఇప్పుడు యూ‌కే కొత్త ప్రధానమంత్రిగా నియమితులవడంతో అతని అఫిషియల్ రైడ్ కోసం రేంజ్ రోవర్ అబియో సెంటినల్ ఉంది. రిషి సునక్  రేంజ్ రోవర్ కార్ మల్టీ-లామినేటెడ్ ప్రైవసీ గ్లాస్‌తో విస్తృతమైన ఆర్మర్ పొందుతుంది ఇంకా 15 కిలోల వరకు TNT పేలుళ్లు, DM51 గ్రెనేడ్ పేలుళ్లను తట్టుకోగలదు.

జాగ్వార్ XJ L
రిషి సునక్ కొన్ని సార్లు జాగ్వార్ XJ Lలో కనిపిస్తుంటాడు. ఇంకా ఈ కారు సెంటినెల్ వెర్షన్, అంతేకాదు బుల్లెట్ల నుండి రక్షణగా భారీ ఆర్మర్ తో వస్తుంది. సెడాన్‌లో మందపాటి కెవ్లార్ షీట్‌లు, పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంక్‌లు, ల్యాండ్‌మైన్‌ల నుండి సురక్షితంగా ఉంచడానికి ఫ్లోరింగ్‌పై మందపాటి ప్లేట్‌ల షీట్‌లు ఉంటాయి. రిషి సునక్  జాగ్వార్ XJ L సెంటినెల్ కూడా వెంటిలేషన్ సిస్టమ్‌ పొందింది.

ల్యాండ్ రోవర్ డిస్కవరి 
PLA ఆర్కిటెక్చర్ ఆధారంగా ల్యాండ్ రోవర్ డిస్కవరీ  మూడవ జనరేషన్ కూడా పి‌ఎం రిషి సునక్ కోసం కేటాయించారు. అయితే ఈ కారు  ప్రభుత్వానికి చెందినది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ రెండు ఇంజన్ ఆప్షన్స్ లో అమ్మకానికి ఉంది - 3.0-లీటర్ V6 పెట్రోల్ అండ్ 3.0-లీటర్ డీజిల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.

click me!