భారత మార్కెట్లోకి టయోటా ఇన్నోవా లేటెస్ట్ మోడల్.. ఎం‌జి, కీయా కార్లను బీట్ చేసే లుక్ తో..

By asianet news telugu  |  First Published Oct 31, 2022, 4:27 PM IST

కొత్త జనరేషన్ ఇన్నోవా భారతీయ రోడ్లపై  పరీక్షిస్తున్నప్పుడు చాలా సార్లు కనిపించింది. టయోటా ఇండోనేషియా ఇప్పటికే 3-వరుసల ఎం‌పి‌వి టీజర్‌ను కూడా లాంచ్ చేసింది.  


ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ ని 25 నవంబర్ 2022న ఇండియాలో ప్రవేశపెట్టనున్నారు. ఇండియా కంటే ముందు ఈ 3-వరుసల మల్టీపర్పస్ వెహికల్ (MPV) 21 నవంబర్ 2022న ఇండోనేషియా మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. ఇండోనేషియా-స్పెక్ మోడల్ పేరు కొత్త ఇన్నోవా జెనిక్స్. నివేదిక ప్రకారం, ఈ కొత్త టయోటా ఎమ్‌పివి కారు నవంబర్‌లో ఇండియాలో ప్రవేశపెట్టినప్పటికీ, దీని ధర జనవరిలో జరిగే 2023 ఆటో ఎక్స్‌పోలో వెల్లడించనున్నారు. 

కొత్త జనరేషన్ ఇన్నోవా భారతీయ రోడ్లపై  పరీక్షిస్తున్నప్పుడు చాలా సార్లు కనిపించింది. టయోటా ఇండోనేషియా ఇప్పటికే 3-వరుసల ఎం‌పి‌వి టీజర్‌ను కూడా లాంచ్ చేసింది.  ఈ ఎం‌పి‌వి సరికొత్త హెడ్‌ల్యాంప్ సెటప్‌తో వస్తుంది, బానెట్‌పై స్ట్రాంగ్ క్రీజ్ కనిపిస్తుంది, బంపర్ ట్రాయాంగులర్ ఫాగ్ ల్యాంప్‌లను పొందుతుంది.  

Latest Videos

undefined

వెనుక వైపున ఎల్‌ఈ‌డి బ్రేక్ లైట్లు, కొత్తగా స్టైల్ చేసిన 10-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో హారిజంటల్ టెయిల్-ల్యాంప్‌లు, కొత్త మోడల్ 2,850ఎం‌ఎం వీల్‌బేస్‌, పొడవు 4.7 మీటర్లు ఉంటుంది. పెద్ద వీల్‌బేస్ టయోటా క్యాబిన్ లోపల మరింత స్థలాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. ప్రస్తుత మోడల్ లాగానే కొత్త ఇన్నోవా హైక్రాస్ మల్టీ సీటింగ్ ఆప్షన్స్ ఉంటుంది. 

2023 టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టాలో లేని మరిన్ని సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్‌లతో అమర్చబడి వస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే కొత్త MPVలో 360-డిగ్రీ కెమెరాలు, ఫ్యాక్టరీకి ఫిట్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండవ వరుస కెప్టెన్ సీట్ల కోసం 'ఒట్టోమన్ ఫంక్షన్', వైర్‌లెస్ కనెక్టివిటీ ఇంకా ఎన్నో ఉన్నాయి. . 

నివేదిక ప్రకారం, కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ టయోటా సేఫ్టీ సెన్స్ (టిఎస్ఎస్)తో రానుంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పాదచారులను గుర్తించే ప్రీ-కొలిజన్ సిస్టమ్, రోడ్ సైన్ అసిస్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్ వంటి ఫీచర్లతో టయోటా ADAS టెక్నాలజీ. 

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ లాడర్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌కు బదులుగా లైట్ వేట్ మోనోకోక్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడుతుంది. RWD (రేర్-వీల్ డ్రైవ్) FWD (ఫ్రంట్-వీల్ డ్రైవ్) సెటప్ ద్వారా రీప్లేస్ చేస్తుంది. ఇంకా రెండు ఇంజన్ ఆప్షన్స్ లో అందించనున్నారు - 2.0-లీటర్ పెట్రోల్ అండ్ 2.0-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ.  

click me!