ప్రముఖ వాహన తయారీ కంపనీ మారుతీ సుజుకి తమ సంస్థకు చెందిన కొత్త స్విప్ట్, డిజైర్ కార్లను రీకాల్ చేసింది. ఈ మధ్య తయారుచేసిన కొన్ని కార్లలో ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ లో లోపాలున్నట్లు గుర్తించి కంపనీ ఆ వాహనాలను వెనక్కి రప్పిస్తోంది.

మే నెల 7వ తేదీ నుండి జులై 5వ తేదీ వరకు మారుతి సుజుకి కొత్తగా తయారుచేసిన స్విప్ట్, డిజైర్ కార్లలో లోపాలున్నట్లు గుర్తించింది. ఈ మధ్య కాలంలో తయారుచేసిన కార్లలో దాదాపు 1279 ఇప్పటికే మార్కెట్లోకి వెళ్లిపోయినట్లు కంపనీ గుర్తించింది. వీటిలో 566 స్విప్ట్ కార్లు ఉండగా, 713 డిజైర్ లు ఉన్నాయి. వీటన్నింటిని వెనక్కి రప్పించి ఎయిర్ బ్యాగ్ యూనిట్ ను సరిచేయనున్నట్లు మారుతీ సుజుకి అధికారులు తెలిపారు. అందుకోసం ఇప్పటికే డీలర్లకు ఆదేశాలకు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ లోపాలను కంపనీ ఉచితంగా సరిచేసి ఇవ్వనున్నట్లు తెలిపింది. వీరు తెలిపిన తేదీల్లో తయారయిన వాహనాలను కొన్నవారు సమీపంలోని మారుతి సుజుకి డీలర్లను సంప్రదించాలని సూచించారు. మరింత సమాచారం కోసం మారుతీ సుజుకి వెబ్ సైట్ ను చూడాలని కంపనీ అధికారులు తెలిపారు.