బీఎస్-6 ప్రమాణాలతో విపణిలోకి హోండా షైన్’ బైక్.. రూ.67,857

By narsimha lode  |  First Published Feb 21, 2020, 6:01 PM IST

‘హోండా మోటార్ సైకిల్స్’ తాజాగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త బైక్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.నూతన హోండా ఏసీజీలో ప్రయాణ సమయంలో చార్జింగ్ విత్ బ్యాటరీ కరంట్ జనరేట్ చేస్తుంది. 
 


ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్స్’ తాజాగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన హోండా షైన్ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ.67,857గా కంపెనీ నిర్ణయించింది. న్యూ మీటర్ డిజైన్‌తో  స్మార్ట్ టెయిల్ ల్యాంప్, బ్లాక్ అల్లాయ్స్‌తో రూపుదిద్దుకున్నది. 

షైన్ బీఎస్-6 మోడల్ బైక్ కోసం ఆరేళ్ల వారంటీ ప్యాకేజీ (మూడేళ్లు స్టాండర్డ్- మూడేళ్ల ఆప్షనల్ వారంటీ) అందుబాటులో ఉంది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో షైన్ బీఎస్-6 బైక్ వినియోగదారులకు లభ్యం అవుతుంది. బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ కలర్స్‌లో షైన్ బైక్ లభిస్తుంది. 

Latest Videos

5-స్టెప్ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్, స్మూత్‌గా ప్రయాణించడానికి వీలుగా రూపుదిద్దుకున్న బైక్ ఇది. సీల్ చెయిన్, లెస్ ఫ్రీక్వెంట్ అడ్జస్ట్‌మెంట్స్, లో మెయింటెన్స్ ఖర్చు మాత్రమే ఈ బైక్ అవసరం. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన షైన్ బైక్.. ఈక్వలైజర్, ఇంక్రీజ్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ (+ 5 మిమీ), లాంగర్ వీల్ బేస్ బేస్ (+19 మిమీ) కాంబీ-బ్రేక్ సిస్టమ్ (సీబీఎస్)తోపాటు స్టెబిలిటీ, బ్యాలెన్స్ కలిగి ఉన్నాయి. 

ఫ్యూయల్ ట్యాంక్‌తోపాటు లాంగర్ సీట్ (+27 మిమీ), కంఫర్టబుల్ లాండ్ డిస్టెన్స్ ట్రావెల్ గల ఆంపుల్ స్పేస్ కలిగి ఉంది. హోండా మోటారు సైకిల్స్ ఇండియా ప్రెసిడెంట్ కం సీఈఓ-మేనేజింగ్ డైరెక్టర్ మినోరు కాటో ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నూతన తరం దిశగా పరివర్తన చెందుతున్న హోండా.. 2.5 లక్షల మందికి పైగా కస్టమర్లను కలిగి ఉన్నందుకు గర్వంగా ఉంది. బీఎస్-6 ప్రమాణాలతోపాటు 125 సీసీ మోటారు సైకిల్ సెగ్మెంట్ లో మరో మోడల్ బైక్ ఆవిష్కరించడం క్వైట్ రివల్యూషన్ కానున్నది’ అని తెలిపారు. 

హోండా మోటారు సైకిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు యద్వీర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ ‘80 లక్షలకు పైగా కస్టమర్లలో గల నమ్మకమే షైన్ విజయాన్ని తెలియజేస్తుంది. సూపరియర్ టెక్నాలజీ, 5-స్పీడ్ ట్రాన్స్మిషన్, న్యూ ఫీచర్లు, 14% అదనపు ఫ్యూయల్ ఎఫిషెన్సీ’ అని చెప్పారు. 

‘బీఎస్-6 ప్రమాణాలతోపాటు 125 సీసీ పీజీఎం ఎఫ్ఐ-హెట్ (హోండా ఎకో టెక్నాలజీ) ఇంజిన్, బూస్ట్ బై ఎన్ హాన్స్ డ్ స్మార్ట్ పవర్‌తో రూపుదిద్దుకున్నదీ బైక్. నూతన హోండా ఏసీజీలో ప్రయాణ సమయంలో చార్జింగ్ విత్ బ్యాటరీ కరంట్ జనరేట్ చేస్తుంది. 

ఇందులో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (పీజీఎం-ఎఫ్ఐ), ఫ్రిక్షన్ రిడక్షన్, మైలేజీ అప్, 5 స్పీడ్ ట్రాన్స్ మిషన్, న్యూ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్ అండ్ పాసింగ్ స్విచ్ తదితర సౌకర్యాలు కలిగి ఉంటుందీ హోండా షైన్ 125సీసీ బైక్. 

click me!