హీరో కొత్త మోడల్ పాషన్ ప్రో అండ్ గ్లామర్...ఇప్పుడు బిఎస్ 6 ఇంజన్ తో....

By Sandra Ashok Kumar  |  First Published Feb 19, 2020, 12:53 PM IST

హీరో మోటోకార్ప్ భారతదేశంలో అప్‌డేట్ చేసిన లేటెస్ట్ ఫీచర్స్ గల హీరో పాషన్ ప్రో, గ్లామర్ 2020 మోడల్  బైకులను లాంచ్ చేసింది.


హీరో మోటోకార్ప్ సంస్థ ఇప్పుడు కొత్త అప్‌డేటెడ్, బిఎస్ 6 కంప్లైంట్ హీరో పాషన్ ప్రో, గ్లామర్ 2020 మోడళ్లను విడుదల చేసింది. రెండు బైక్‌లు కొత్త స్టైలింగ్, ఫీచర్స్ ఉన్నాయి ఇంకా కొత్త 110 సిసి, 125 సిసి ఇంజిన్‌లతో వస్తున్నాయి.

హీరో మోటోకార్ప్ భారతదేశంలో అప్‌డేట్ చేసిన లేటెస్ట్ ఫీచర్స్ గల హీరో పాషన్ ప్రో, గ్లామర్ 2020 మోడల్  బైకులను లాంచ్ చేసింది.ఈ బైక్‌లు కొత్త స్టైలింగ్‌లు, ఫీచర్లతో ఇప్పుడు కొత్త బి‌ఎస్ 6 ఇంజన్‌లతో వచ్చేశాయి. రాబోయే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైకులు ఉంటాయి.

Latest Videos

undefined

also read టయోటా నుండి కొత్త మోడల్ ఫార్చ్యూనర్ ...ఇప్పుడు బిఎస్ 6 ఇంజన్ తో...

 ఈ రెండు బైక్‌లు రెండు కొత్త వేరియంట్‌లలో వస్తాయి. డ్రమ్, డిస్క్ బ్రేక్ ఆప్షన్స్ ఉన్నాయి. హీరో పాషన్ ప్రో 2020 ధర రూ.64,990 నుండి 67,190 ఉంది. హీరో గ్లామర్ ధర రూ.68,900 నుండి 72,400 ఉంటుంది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ , ఢిల్లీ).

ఈ రెండూ బైకులు కూడా కొత్త ఎక్స్‌సెన్స్ ఫ్యుయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తాయి. ఇది ఎక్కువ ఇంధన-సామర్థ్యం, సున్నితమైన   యాక్సిలరేషన్ మొత్తం మీద సున్నితమైన రైడ్‌ను అందించడంలో సహాయపడుతుంది.

హీరో పాషన్ ప్రో బిఎస్ 6 కంప్లైంట్ 110 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.02 బిహెచ్‌పిని ట్యూన్ చేస్తుంది. 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.79 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ను అభివృద్ధి చేస్తుంది.పాత వెర్షన్‌తో పోల్చితే అప్‌డేట్ చేసిన పాషన్ ప్రో 9 శాతం ఎక్కువ శక్తిని, 22 శాతం ఎక్కువ టార్క్‌ను అందిస్తుందని హీరో సంస్థ తెలిపింది.

also read ఆ కారణంగా భారత్‌లో 9%.. ప్రపంచంలో 37.5 కోట్ల ఉద్యోగాలు హాంఫట్!

మరోవైపు హీరో గ్లామర్ 2020 మోడల్ కొత్త 125 సిసి సింగిల్ సిలిండర్ కలిగి ఉంది. ఇది ఇప్పుడు 19 శాతం ఎక్కువ పవర్ ని ట్యూన్ చేస్తుంది. 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.73 బిహెచ్‌పి, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఇప్పుడు 4-స్పీడ్ యూనిట్‌కు బదులుగా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

 ఇప్పుడు పాషన్ ప్రో 4 కొత్త కలర్ ఆప్షన్స్ తో ఆల్-న్యూ స్టైలింగ్‌తో వస్తుంది. కొత్త మోడల్ కొత్త ట్రిపుల్ టోన్ యెల్లో, సిల్వర్, బ్లాక్  షేడ్ లో 'ప్రో' లెట్టింగ్‌తో ట్యాంక్‌కు డెకాల్స్‌ ఉపయోగించారు.రివైజ్డ్ హెడ్‌ల్యాంప్, కొత్త హెచ్-పాటర్న్ టైలాంప్ మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ కొత్త ఆకర్షణగా ఉంటాయి.

మరోవైపు కొత్త గ్లామర్ 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. కొత్త స్ప్లిట్ -5-స్పోక్ అల్లాయ్ వీల్స్, రియల్ టైమ్ మైలేజ్ వివరాలతో పాటు డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా  ఐ3 టెక్నాలజీ ఉంది.
 

click me!