మోటార్ షో: కవాసాకి నింజా జెడ్‌ఎక్స్ -25ఆర్

By Sandra Ashok Kumar  |  First Published Oct 26, 2019, 5:05 PM IST

జపాన్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ కవాసాకి ఇప్పుడు కొనసాగుతున్న 2019 టోక్యో మోటార్ షోలో కవాసకి నింజా జెడ్ఎక్స్ -25 ఆర్ ను వెల్లడించింది.
 


కవసాకి నింజా జెడ్‌ఎక్స్ -25 ఆర్ 2019 టోక్యో మోటార్ షోలో వెల్లడైంది. ఇది కొంతకాలంగా అభివృద్ధిలో ఉంది ఇప్పుడు చివరకు దానిని మోటార్ షోలో  ప్రదర్శించారు. కవసాకి జెడ్ హెచ్ 2 తో పాటు నింజా జెడ్ఎక్స్ -25 ఆర్ లాంచ్ చేయబడింది. ఇది నింజా హెచ్ 2 తరహాలో సూపర్ చార్జిడ్  మోడల్.

also read జావా, రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా బెనెల్లి కొత్త బైక్

Latest Videos

undefined

 కవాసాకి నింజా జెడ్‌ఎక్స్ -25 ఆర్ కొత్త 249 సిసి ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌ను పొందుతుంది, ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌.  కంపెనీ దీని పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్‌లను ఇంకా వెల్లడించలేదు. కానీ ఇంటర్నెట్‌లోని నివేదికల ప్రకారం అవి 45-50 బిహెచ్‌పి మరియు 25-30 ఎన్‌ఎమ్‌ల మధ్య ఉండవచ్చని అంచనా. దీని ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జత చేయబడుతుంది.

1980-90 చివరిలో కంపెనీ ZX250R ను విక్రయించినట్లు కవాసాకి అభిమానులు గుర్తించే ఉంటారు. కవాసాకి నుండి కొత్త 250 షోయా బిగ్ పిస్టన్ ఫోర్కులు, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ మరియు వివిధ రైడర్ మోడ్లు వంటి టాప్-స్పెసిఫికేషన్ పరికరాలను అమర్చారు. స్టైలింగ్ లో  కొత్త నింజా 400, ZX-6R లతో సమానంగా ఉంటుంది. ZX-25Rకు ఒక ఎగ్జాస్ట్ సైలెన్సర్ అమర్చారు.

also read మళ్ళీ మార్కెట్లోకి హార్లీ డేవిడ్సన్ " లైవ్ వైర్"

ఇంజన్ సామర్ధ్యం 250 సిసి, 4-సిలిండర్ ఇంజన్, పొడవైన పరికరాల జాబితాతో  కొత్త బేబీ నింజా చాలా ఖరీదైనదని మేము భావిస్తున్నాము. త్వరలో ఇది ఎప్పుడైనా భారతదేశంలో ప్రారంభించవచ్చు అని మాకు ఆనందంగా ఉంది. మార్కెట్ లో  పోటీకి సంబంధించినంత వరకు ఇది హోండా సిబిఆర్ 250 ఆర్ఆర్ వంటి వాటికి పోటీగా నిలుస్తుంది.

click me!