Modified Mahindra XUV700: రియో ​​పారాలింపిక్స్‌ విజేతకు స్పెషల్ ఎక్స్‌యూ‌వి700 డెలివరీ.. ట్విటర్ వైరల్..

By asianet news telugu  |  First Published Mar 3, 2022, 12:10 PM IST

 మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రియో ​​పారాలింపిక్స్‌లో షాట్ త్రో (F-53 ఈవెంట్)లో రజత పతక విజేత, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపా మాలిక్ (deepa malik)కి మోడిఫైడ్ మహీంద్రా ఎక్స్‌యూ‌వి700ని డెలివరీ చేశారు. 
 


దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా (mahindra & mahindra) టోక్యో పారాలింపిక్ 2021 (tokyo paralympics2021)లో అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లకు సరికొత్త ఎస్‌యూ‌వి ఎక్స్‌యూ‌వి700  మోడిఫైడ్ వెర్షన్‌ను బహుమతిగా అందించింది. ఇప్పుడు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రియో ​​పారాలింపిక్స్‌లో షాట్ త్రో (F-53 ఈవెంట్)లో రజత పతక విజేత, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపా మాలిక్ (deepa malik)కి మోడిఫైడ్ మహీంద్రా ఎక్స్‌యూ‌వి700ని డెలివరీ చేశారు. 

పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత, మాజీ క్రీడాకారుడు ఆగస్టు 2021లో సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఆనంద్ మహీంద్రా, రతన్ టాటా, టాటా మోటార్స్, ఎం‌జి మోటార్ వంటి ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వ్యక్తుల కంపెనీలకు ఎస్‌యూ‌విల కార్లలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీపా మాలిక్  ట్విట్టర్  ట్వీట్‌లో  "నేను ఈ టెక్నాలజితో ఎంతో ఆకట్టుకున్నాను. భారతదేశంలోని ఆటోమొబైల్ ప్రపంచం మాకు ఈ గౌరవాన్ని, సౌకర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. నేను పెద్ద ఎస్‌యూ‌విలను నడపడం ఇష్టపడతాను, కానీ కారు లోపలికి, బయటికి వెళ్లడం నాకు చాలా పెద్ద సవాలు. నాకు ఇలాంటి సీటు ఇవ్వండి. నేను మీ ఎస్‌యూ‌విని కొంటాను." అని పోస్ట్ చేశారు.

Latest Videos

undefined

దీపా మాలికా ట్వీట్‌కు సమాధానమిస్తూ, ఆనంద్ మహీంద్రా అధికారిక ట్విట్టర్ ద్వారా "దీపా మాలిక్, నేను మీ ఈ ఛాలెంజ్‌ను తీసుకొంటు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ అండ్ బృందానికి అందజేస్తాను. మేము ఇప్పటికే కార్ సిస్టమ్‌లో ప్రావీణ్యం సంపాదించిన ట్రూ అసిస్ టెక్‌తో కలిసి పని చేస్తాము. పారాలింపిక్స్‌లో పాల్గొన్న మా ఆటగాళ్లందరికీ కూడా చీర్స్."అని అన్నారు.

ఇప్పుడు దీపా మాలిక్ కోరికను మహీంద్రా గ్రూప్ నెరవేర్చింది.  ఆమె మోడిఫైడ్ మహీంద్రా ఎక్స్‌యూ‌వి700ని పొందింది. దీపా మాలిక్ మార్చి 1న ట్వీట్ ద్వారా ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. 

మోడిఫైడ్  ఎక్స్‌యూ‌వి700 ఫీచర్లు
మోడిఫైడ్ మహీంద్రా XUV700 కారు  ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఈ కారును అవని లేఖార(Avani Lekhara) కోసం విడిగా కస్టమైజ్ చేయబడింది. కస్టమైజ్ XUV700 సీట్లు రెండు ప్రత్యేక ఫంక్షన్‌లతో వస్తాయి - ముందుకి అండ్ వెనక్కి. సీటు మొదట ముందుకు కదులుతుంది, ఆపై ఎస్‌యూ‌వి నుండి బయటకు వచ్చేలా తిరుగుతుంది. చివరికి కిందకి కూడా వస్తుంది. తద్వారా డ్రైవర్ సౌకర్యవంతంగా వీల్ చైర్ నుంచి సీటుకు మారవచ్చు. అదనంగా, సీటు కిందకి వచ్చే ఫంక్షన్ ముఖ్యంగా వికలాంగులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సవాలును పరిష్కరిస్తుంది. ఈ కారణంగా దీపా మాలిక్ భారతీయ రోడ్లపై ఈ మోడిఫైడ్ కార్లను చూడాలనుకుంటున్నారు, దీని ద్వారా వికలాంగులు మరింత సౌకర్యాన్ని పొందవచ్చు. 

మహీంద్రా బహుమతి
మహీంద్రా ఇంతకుముందు కూడా స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, టోక్యో పారాలింపిక్ విజేత సుమిత్ ఆంటిల్‌లకు కస్టమ్-మేడ్ XUV700 SUVని అందించింది. మహీంద్రా & మహీంద్రా ఈ రంగాలలో అత్యుత్తమ భారతీయ అథ్లెట్లను గుర్తించడానికి చేసిన ప్రయత్నంగా దీనిని భావించింది. 

click me!