సుజుకి ఆల్టో చిట్టి కారు.. క్రేజీ లుక్, భలే ఫీచర్స్ ఆదిరిపోయిందిగా..

By asianet news teluguFirst Published Aug 24, 2022, 12:56 PM IST
Highlights

కెయి కార్లు బీమా అండ్ పన్ను ప్రయోజనాలను కూడా పొందుతాయి. అలాగే సిటీలో ఇరుకైన వీధులు ఇంకా రద్దీగా ఉండే రోడ్లలో ఈ కార్లను నడపడం చాలా సులభం. గత కొన్ని సంవత్సరాలుగా Kei కార్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 

జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకి అధికారికంగా లేటెస్ట్ కెయి (kei) కార్ 2023 సుజుకి ఆల్టో లాపిన్ LCని పరిచయం చేసింది. సిటీ కార్స్ లేదా మైక్రో-మినీ కార్స్ అని కూడా పిలువబడే Kei కార్లు జపాన్‌లో పాపులర్ సెగ్మెంట్ కార్లు. ఈ కార్లు పరిమితం చేయబడిన సైజ్ అండ్ ఇంజిన్ సామర్థ్యంతో అతి చిన్న హైవే లీగల్ కార్. 

Kei కార్లు బీమా అండ్ పన్ను ప్రయోజనాలను కూడా పొందుతాయి. అలాగే సిటీలో ఇరుకైన వీధులు ఇంకా రద్దీగా ఉండే రోడ్లలో ఈ కార్లను నడపడం చాలా సులభం. ఈ రూల్స్ 1949లో సృష్టించారు, గత కొన్ని సంవత్సరాలుగా Kei కార్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 

సుజుకి ఆల్టో లాపిన్ ఎల్‌సి విషయానికి వస్తే లాపిన్ అంటే ఫ్రెంచ్‌లో కుందేలు అని అర్థం, ఇది కారు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.  ఈ కారు 3వ జనరేషన్ కార్ ఇంకా దీనికి  ప్రత్యేకమైన స్టైలింగ్‌  ఉంది. అలాగే గుండ్రని హెడ్‌లైట్లు, బాక్సీ డిజైన్, స్టీల్ వీల్స్‌ పొందుతుంది. కొత్త ఆల్టో లాపిన్ LC రెట్రో డిజైన్‌ కారు రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. 

కారు క్యాబిన్ విషయానికి వస్తే ఇంటీరియర్ సింపుల్‌గా ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది.  డ్యాష్-మౌంటెడ్ గేర్ లివర్, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మినిమైజ్ బటన్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో  డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌ పొందుతుంది. గేర్ లివర్  లొకేషన్ ముందు ప్రయాణీకులకు ఎక్కువ స్థలం సృష్టిస్తుంది ఇంకా ఈ కారు మైక్రో హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ మొత్తం క్యాబిన్ చాలా విశాలంగా కనిపిస్తుంది. 

ఆల్టో లాపిన్ LC కార్ 660cc, మూడు-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. CVT గేర్‌బాక్స్ సహాయంతో 62 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇంకా ముందు చక్రాలకు శక్తినిస్తుంది. ఆల్టో లాపిన్ LC ను ఆల్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.  

కెయి కార్లు ప్రధానంగా జపాన్‌లో విక్రయించబడుతున్నందున సుజుకి ఆల్టో లాపిన్ భారత్‌ వచ్చే అవకాశాలు తక్కువే. అయితే, మారుతి సుజుకి ఇండియా కోసం ఆల్టో లాపిన్ LC వంటి కారు గురించి ఆలోచిస్తే, కంపెనీ భారతీయ మార్కెట్‌కు సరైన ధరను నిర్ణయించగలిగితే అది గొప్ప ప్యాసెంజర్ కారు కావచ్చు. 2023 సుజుకి ఆల్టో లాపిన్ LC ప్రస్తుతం జపాన్‌లో రూ. 8.15 లక్షల ధరకు విక్రయిస్తున్నారు.

click me!