Auto News Telugu: మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విడుదల.. ఈ కారులో కొత్తగా ఏమున్నాయంటే..!

By team telugu  |  First Published Apr 21, 2022, 3:49 PM IST

Maruti XL6 Prices Start: మారుతి సుజుకి ఇటీవలే కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్, రీట్యూన్ చేయబడిన ఇంజన్‌తో తమ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివిని విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. ఎర్టిగా ఆధారంగా కంపెనీ తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6 )లో కూడా ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఈ విభాగంలో కొత్తగా వచ్చిన కియా కారెన్స్, మహీంద్రా మరాజో వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.
 


ప్రముఖ వాహన తయారీదారు మారుతి సుజుకి సరికొత్తగా 2022 XL6 Nexaని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది Zeta, Alpha, Alpha Plus అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన Zeta వేరియంట్ ధర ఎక్స్ షోరూమ్ వద్ద రూ. 11.29 లక్షలు ఉండగా, డ్యుఎల్ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన ఆల్ఫా+ వేరియంట్ ధర రూ. 14.55 లక్షలుగా ఉంది. వేరియంట్ ను బట్టి ధరలలో మార్పులున్నాయి.

మారుతి సుజుకి నుండి తాజా XL6 దాని బాహ్య బాడీ స్టైల్‌కు అనేక చిన్న మరియు ముఖ్యమైన నవీకరణలను పొందింది. ఫ్రంట్ గ్రిల్ మరింత క్రోమ్ గార్నిష్‌తో అప్‌డేట్ చేయబడింది, అయితే వాహనం వైపు మరియు వెనుక భాగంలో అదనపు క్రోమ్ గార్నిష్ ఉంది. ఈ 2022 XL6 ఫేస్‌లిఫ్ట్ వాహనానికి డ్యూయల్-టోన్ అల్లాయ్‌తో కూడిన 16-అంగుళాల పరిమాణం కలిగిన పెద్ద టైర్లను అమర్చారు.

Latest Videos

undefined

XL6 ఆరు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. అవి సెలెస్టియల్ బ్లూ, బ్రేవ్ ఖాకీ, ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యుర్ గ్రే, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్. ఇందులో ఖాకీ, రెడ్ ఇంకా సిల్వర్ రంగు వాహానాలను బ్లాక్ రూఫ్‌తో కలిపి డ్యూయల్ టోన్ సెటప్‌తో ఎంచుకునే అవకాశం కూడా ఉంది. XL6 కార్ ఇంటీరియర్ పరిశీలిస్తే .. ఈ కారుకు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇచ్చారు. సుజుకి కనెక్ట్ మోడల్‌ ద్వారా వాహనానికి సంబంధించిన దాదాపు 40 ఫీచర్లను రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు.

ఆరుగురు వ్యక్తులు కూర్చునేలా విశాలంగా ఉంటుంది. ఫీచర్లను మరింత మెరుగుపరిచారు. డాష్ బోర్డుకు ఏడు అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్‌ను అందించారు. మారుతి XL6 నెక్ట్స్ జెనరేషన్ K-సిరీస్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇంజన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు సరికొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 103 హెచ్‌పి శక్తిని ఇంకా 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. XL6 లో అనేక కీలకమైన భద్రతా ఫీచర్లను అప్‌డేట్‌ చేశారు. MPV తాజా HEARTECT ప్లాట్‌ఫారమ్‌పై అందిస్తున్నారు. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఇంకా డ్యూయల్ ఫ్రంట్ సైడ్ క్వాడ్ ఎయిర్‌బ్యాగ్‌లని ఇచ్చారు. అదేవిధంగా ABS, EBS స్టాండర్డ్‌గా వస్తాయి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లో ప్రెజర్ హెచ్చరికలు తదితర ఫీచర్లు ఉన్నాయి.

click me!