మారుతి సుజుకి విటారా హైబ్రిడ్ SUV: రాబోయే కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా జూలై 20న విడుదల కానుంది. కొత్త టీజర్ ప్రకారం, మిడ్-సైజ్ హైబ్రిడ్ SUV, ఇది భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుండి మొదటి బలమైన హైబ్రిడ్ SUV.
రాబోయే కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా జూలై 20న లాంచ్ కి సిద్ధంగా ఉంది. అఫిషియల్ ప్రకటనకు ముందు కొత్త SUV విలాసవంతమైన సన్‌రూఫ్‌ను పొందుతుందని కంపెనీ వెల్లడించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా కూడా కంపెనీ డిజైన్ లాంగ్వేజ్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ ఎండ్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. SUVకి సరిపోయేల కొత్త గ్రిల్‌తో పాటు ఫ్రంట్ ఎండ్ LED DRLలు, ఇండికేటర్స్ పొందవచ్చని భావిస్తున్నారు. గ్రాండ్ విటారా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది, ఈ ఫీచర్ వాహనం ఆఫ్-రోడ్ సామర్థ్యాలను ఇస్తుంది.
మారుతి సుజుకి విటారా హైబ్రిడ్ SUV కంపెనీ Nexa ప్రీమియం డీలర్‌షిప్‌లలో మాత్రమే విక్రయించనుంది. అయితే రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో మారుతి సుజుకి విటారా ధర దాదాపు రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్).
undefined
విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీ ఫీచర్లు
మారుతి సుజుకి విటారా హైబ్రిడ్ SUV డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఆపిల్ కార్‌ప్లే ఆండ్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ చార్జర్ తో వస్తుంది. ఈ కారు ఆటో క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, లెథెరెట్ సీట్లు, 6-స్పీకర్ ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్‌తో కూడిన విశాలమైన క్యాబిన్‌ను పొందుతుంది.
విటారా హైబ్రిడ్ SUV ఇంజన్
మారుతి సుజుకి రాబోయే 2022 విటారాను 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రవొచ్చు. స్ట్రాంగ్-హైబ్రిడ్ పనితీరు కోసం 1.5L పెట్రోల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిపి అందించవచ్చు. ప్రస్తుతం, మారుతి SUV సెగ్మెంట్‌లో మాత్రమే మారుతి సుజుకి బ్రెజ్జా, S-క్రాస్‌లను అందిస్తోంది.