మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో కార్లను పరిచయం చేసిన కంపెనీ మారుతి సుజుకి. జపాన్ కు చెందిన ఈ కంపనీ ఇండియాలో తన మార్కెట్ విస్తృతపర్చుకోడానికి మధ్యతరగతి ప్రజల్నే టార్గెట్ చేసుకుని సక్సెసయ్యింది. అయితే తాజాగా ఈ సంస్థ తమ కంపనీకి చెందిన వాహనాల రేట్లను పెంచి కొత్త వినియోగదారులపై భారం మోపడానికి సిద్దమైంది.

ఇప్పటికే మహింద్రా ఆండ్ మహింద్రా, టాటా మోటార్స్ వంటి దేశీయ కంపనీలు తమ వాహనాల రేట్లను పెంచిన విషయం తెలిసిందే. వీటి బాటలోనే మారుతీ సుజుకి నడవడానికి సిద్దమైంది. సలు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు మారుతి సుజుకి ఇవాళ ప్రకటించింది. ఈ పెంపు కూడా ఈ నెల నుండే వర్తిస్తుందని, వినియోగదారులు, డీలర్లు ఈ పెంపు విషయాన్ని గుర్తించాలని కంపనీ పస్రకటించింది.
ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు విదేశీ మారకం రేటులో అనిశ్చితి కారణంగా ఈ పెంపు అనివార్యమైందని సంస్థ వెల్లడించింది. ఇవే కాకుండా ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎస్.ఎస్.కాల్సీ తెలిపారు. పెరిగిన మోడల్స్ ధరలను తమ వెబ్ సైట్ లో పొందుపర్చామని ఎస్.ఎస్.కాల్సీ తెలిపారు.