మారుతి సుజుకి ఆల్టో కొత్త వేరియంట్...ఇప్పుడు అప్ డేట్ ఫీచర్స్ తో...

By Sandra Ashok KumarFirst Published Dec 19, 2019, 4:52 PM IST
Highlights

మారుతి సుజుకి  కొత్త ఆల్టో విఎక్స్ఐ+లో  సరికొత్త స్మార్ట్‌ప్లే 2.0,ఇంకా 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది. ఇది 2019లో లాంచ్ చేసిన వాగన్ఆర్‌లో ఈ ఫీచర్ ప్రారంభమైంది. చివరికి బాలెనో, సియాజ్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ ఇంకా ఇప్పుడు ఆల్టో వంటి ఇతర మోడళ్లలోకి ఈ కొత్త ఫీచర్స్ ని అప్ గ్రేడ్ చేసింది.

మారుతి సుజుకి కంపెనీ భారతదేశంలో కొత్త ఆల్టో విఎక్స్ఐ+ వేరియంట్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి కొత్త ఆల్టో విఎక్స్ఐ+లో సరికొత్త స్మార్ట్‌ప్లే 2.0, అలాగే 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తో రాబోతుంది. ఇది 2019లో లాంచ్ చేసిన వాగన్ఆర్‌లో ఈ ఫీచర్ ప్రారంభమైంది. చివరికి బాలెనో, సియాజ్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ ఇంకా ఇప్పుడు ఆల్టో వంటి ఇతర మోడళ్లలోకి ఈ కొత్త ఫీచర్స్ ని అప్ గ్రేడ్ చేసింది. దీని ప్రస్తుత ధర రూ. 3.80లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). 

also read   మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఆటో విడుదల...లక్ష...వారెంటీతో అందుబాటులోకి...

స్మార్ట్ ఫోన్‌ల ద్వారా స్మార్ట్‌ప్లే స్టూడియో ఇంటర్‌ఫేస్‌ను యాక్సెస్ చేయడానికి చిన్న వేరియంట్‌ కార్లలో ఇప్పటికీ స్మార్ట్‌ప్లే మొబైల్ డాక్‌ ను అమార్చుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫేస్‌లిఫ్టెడ్ ఆల్టో 800 ను బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌తో కంపెనీ దీనిని ప్రవేశపెట్టింది. కొత్త  భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ మోడల్ సిద్ధంగా ఉందని పేర్కొంది.


కొత్త ఆల్టో 800 వేరియంట్  796 సిసి, త్రీ సిలిండర్ల ఇంజిన్‌ తో వస్తుంది. ఇది ఇప్పుడు బిఎస్ 6 కంప్లైంట్ ద్వారా 25 శాతం తక్కువ నైట్రోజన్ ఆక్సైడ్ (Nox) ను విడుదల చేస్తుంది. ఇంజిన్ హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో మారుతి సుజుకి సాధించింది.

also read  ఆ రెండు ఆటోమొబైల్ సంస్థ విలీనం...నాలుగో పెద్ద కంపెనీ ఇదే
 

6000 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్‌ఎమ్‌ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త  భద్రతా నిబంధనలకు అనుగుణంగా మారుతి సుజుకి ఆల్టో 800 లో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్-బెల్ట్ రిమైండర్ మరియు స్పీడ్ అలర్ట్ ఫీచర్స్ ఉన్నాయి.


కొత్త ఆల్టో 800 కారు క్రాష్, పాదచారుల భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉందని మారుతి తెలిపింది. మారుతి సుజుకి ఆల్టో 800 భారతదేశంలో కొత్త క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 0.8 వంటి వాటికి మంచి పోటీని ఇస్తుంది. ఇక ఫీచర్స్ పరంగా కూడా దాదాపు సమానంగా ఉంటుంది. కొత్త స్మార్ట్‌ప్లే 2.0 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ ఫుల్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఇందులో ఉంది. 

click me!