ఆ రెండు ఆటోమొబైల్ సంస్థ విలీనం...నాలుగో పెద్ద కంపెనీ ఇదే

By Sandra Ashok KumarFirst Published Dec 19, 2019, 11:47 AM IST
Highlights

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ ఏర్పాటు కావడానికి అడుగు పడింది. ఈ మేరకు ఫియట్ క్రిస్లర్, ప్యూజో సంస్థలు విలీనం కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి. రెండు సంస్థల విలువ 46 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా.
 

మిలాన్: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, పీఎ్సఏ ప్యూజో కంపెనీల మధ్య విలీన ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందంపై బుధవారం రెండు కంపెనీల బోర్డులు సంతకాలు చేశాయి. దీంతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆటో దిగ్గజం ఏర్పాటుకానున్నది. ఈ కంపెనీ నూతన ఉద్గార నిబంధనలను ధీటుగా ఎదుర్కోనున్నది. అంతేకాకుండా కొత్త టెక్నాలజీలను సులభంగా అందుబాటులోకి తీసుకురానున్నది. 

also read మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఆటో విడుదల...లక్ష...వారెంటీతో అందుబాటులోకి...

కొత్తగా ఏర్పాటయ్యే ఆటోమొబైల్ గ్రూపునకు పీఎస్ఏ సీఈఓ కార్లో టావరెస్ సారథ్యం వహించనున్నారు. ఫియట్ క్రిస్లర్ చైర్మన్ జాన్ ఎల్కాన్ విలీన కంపెనీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఫియట్ క్రిస్లర్ సీఈఓ మైక్ మాన్లే కూడా కంపెనీలో ఉంటారు. కానీ ఆయన బాధ్యతల వివరాలు వెల్లడి కాలేదు. 

కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీ పేరును ఇంకా నిర్ణయించలేదు. గత అక్టోబర్ నెలలో ఈ రెండు కంపెనీల 50:50 విలీనంపై ప్రకటన వెలువడింది. కాగా ఇప్పుడు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ పూర్తి కావడానికి 12-15 నెలలు పడుతుందని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

also read ఇంటర్నెట్‌తో బైక్.. తెలంగాణ, ఏపీల్లో ఫిబ్రవరిలో ఆవిష్కరణ

ఈ విలీనం ద్వారా ఏర్పాటయ్యే ఆటోమొబైల్ గ్రూప్ రాబడి దాదాపు 17,000 కోట్ల యూరోలు ఉండనుంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 87 లక్షల కార్లుగా ఉంటుంది. ప్రస్తుతం కార్ల ఉత్పత్తి పరంగా టయోటా, వోక్స్ వ్యాగన్, రెనో-నిస్సాన్ కంపెనీలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ సందర్భంగా టావారెస్, ఎల్కాన్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కార్లు వ్యయ భరితం కానున్నాయన్నారు. వీటి ఉత్పత్తిలోనూ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ లోనూ తలెత్తే సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు. గ్రీన్ డీల్, ఆటానమస్ వెహికల్స్, కనెక్టివిటి వంటి అంశాల్లో గణనీయమైన వనరులు, స్ట్రెంథ్స్, స్కిల్స్ అవసరం అని టావరెస్, ఎల్కాన్ తెలిపారు.  
 

click me!