ఇన్‌పుట్ ఖర్చుల పెరుగిన నేపథ్యంలో కిందటి సంవత్సరం వాహన పరిశ్రమపై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. ఈ ఖర్చులు నిరంతరం పెరగుతుండడంతో మారుతీ సుజుకి ఇప్పటికే జనవరి 2021 మొదలుకుని మార్చి 2022 వరకు వాహన ధరలను దాదాపు 8.8 శాతం మేర పెంచింది.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ఉత్పాదక ఖర్చుల పెరుగుదల దృష్ట్యా ఈ నెలలో తమ అన్ని మోడల్స్‌కు సంబంధించిన కార్ల ధరలను పెంచనున్నట్లు బుధవారం తెలిపింది.
గత సంవత్సరం నుంచి వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితం అవుతూనే ఉందని సంస్థ సెబీకి తెలిపింది. ‘కాబట్టి, అదనపు ఖర్చుల ప్రభావాన్ని ధరల పెంపు ద్వారా వినియోగదారులపై మోపడం కంపెనీకి అత్యవసరంగా మారింది’ అని సంస్థ తెలిపింది.
ఏప్రిల్‌లో ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. పెంపు మోడల్‌ను బట్టి మారుతూ ఉంటుంది. అయితే ప్రతిపాదిత ధరల పెంపు పరిమాణాన్ని కంపెనీ వెల్లడించలేదు.ఇన్‌పుట్ ఖర్చులు నిరంతరం పెరగడం వల్ల ఇప్పటికే జనవరి 2021 నుండి మార్చి 2022 వరకు వాహన ధరలను దాదాపు 8.8 శాతం పెంచింది. ఆల్టో మొదలుకుని ఎస్–క్రాస్ వరకూ వివిధ మోడల్స్‌ను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.25 లక్షల నుండి రూ. 12.77 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంది. ఇప్పటికే టాటా మోటార్స్, హీరో మోటాకార్ప్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు కూడా ఏప్రిల్ నుంచి తమ వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.
undefined
ధరల పెంపు అటుంచితే.. మారుతీ సుజుకీ ఈకో మోడళ్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ మోడల్లో సాంకేతిక సమస్యల కారణంగా 19,731 యూనిట్లు రీకాల్ చేయనున్నట్లు వివరించింది. 2021 జులై 19 నుంచి 2021 అక్టోబర్ 5 మధ్య తయారైన ఈకో మోడళ్లను మాత్రమే రీకాల్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులను తమ డీలర్లు నేరుగా సంప్రదిస్తారని కూడా వెల్లడించింది మారుతీ సుజుకీ.
గతేడాది ఏప్రిల్‌లో ఎంపిక చేసిన మోడల్ కార్లపై 1.6, సెప్టెంబర్‌లో 1.9 శాతం పెంచేసింది. మారుతి కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్‌తోపాటు అన్ని రకాల సీఎన్జీ వేరియంట్లపై రూ.15 వేల వరకు ధర పెరిగింది. భారీగా పెరిగిన ముడి సరుకు ధరలతో కంపెనీ లాభాలపై ఒత్తిడి పడుతున్నది. పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నామని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
ఏప్రిల్ నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా ఇంతకుముందే ప్రకటించాయి. అన్ని రకాల వాణిజ్య వాహనాలపై 2-2.5 శాతం వరకు ధర పెంచుతున్నట్లు గత నెల 22న టాటా మోటార్స్ తెలిపింది. స్టీల్, అల్యూమినియంతోపాటు అరుదైన లోహాలు, ఇతర ముడి సరుకు ధరలు పెరగడంతో వాణిజ్య వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ వెల్లడించింది.