Maruti Suzuki:మళ్లీ మారుతీ సుజుకీ వాహనాల ధరల పెంపు.. ఏ మోడల్ పై ఎంత పెరిగిందంటే..?

By asianet news telugu  |  First Published Apr 18, 2022, 2:45 PM IST

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా సోమవారం అన్నీ మోడల్ ధరలను పెంచినట్లు తెలిపింది. అయితే  ఈ పెంపు వివిధ మోడళ్లపై భిన్నంగా ఉంటుంది. 


దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ( maruti suzuki india) MSI సోమవారం పెరుగుతున్న ఖర్చుల మధ్య అన్నీ మోడల్ ధరలను  పెంచినట్లు తెలిపింది. "అన్ని మోడల్‌లలో సగటు పెంపు 1.3 శాతం - ఎక్స్-షోరూమ్ ధర (delhi)" అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నెలలో  వివిధ మోడళ్లపై పెంపు భిన్నంగా ఉంటుంది. 

గత ఏడాదిలో వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కంపెనీ వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితమైంది. ఆటో తయారీ సంస్థ ఈ సమాచారాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇచ్చారు. అందువల్ల  అదనపు ఖర్చుల ప్రభావాన్ని ధరల పెంపు ద్వారా వినియోగదారులపై వేయడం కంపెనీకి అత్యవసరంగా మారింది. 

Latest Videos

undefined

ఇన్‌పుట్ ఖర్చులో నిరంతర పెరుగుదల కారణంగా జనవరి 2021 నుండి మార్చి 2022 వరకు MSI వాహనాల ధరలను సుమారు 8.8 శాతం పెంచింది. కంపెనీ దేశీయ మార్కెట్లో ఆల్టో (alto) నుండి ఎస్-క్రాస్ (s-cross) వరకు ఎన్నో మోడళ్లను విక్రయిస్తోంది.  

భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ అనేక రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. సెమీకండక్టర్ కొరత సమస్య విరామం లేకుండా కొనసాగుతుండగా రష్యా-ఉక్రెయిన్ వివాదంతో పాటు చైనా అనేక నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించడంతో సప్లయ్ చైన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. 

మహీంద్రా ధరలు కూడా 
మరో దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అని మోడల్ ధరలను తక్షణమే అమల్లోకి వచ్చేలా 2.5 శాతం పెంచినట్లు గురువారం తెలిపింది. ధరల పెంపు 14 ఏప్రిల్ 2022 నుండి అమలులోకి వచ్చింది. 

దీని ఫలితంగా మోడల్ అండ్ వేరియంట్‌ను బట్టి ఎక్స్-షోరూమ్ ధరలపై రూ.10,000 నుండి రూ.63,000 వరకు పెరుగుతుందని దేశీయ ఆటోదిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. స్టీల్, అల్యూమినియం, పల్లాడియం వంటి కమోడిటీల ధరలు పెరగడమే తాజా ధరల పెంపుకు కారణమని మహీంద్రా ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

click me!