పంటలకు మద్దతు ధర...మారుతి కార్ల అమ్మకాల్లో 17 శాతం వృద్ది

 |  First Published Aug 6, 2018, 3:58 PM IST

మధ్యతరగతి, గ్రామీణ ప్రజలకు అందుబాటులో ధరల్లో కార్లను తయారుచేసిన ఘనత మారుతి సుజికి కంపనీకే దక్కుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు, పరిస్థితులకు అనుగుణంగా మారుతీ సంస్థ చాలా మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమై గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో కూడా తమ వినియోగదారులను మారుతి సుజుకి సంస్థ భారీగా పెంచుకుంది. 

ఈ సంస్థ నిర్దేశిత వార్షిక లక్ష్యానికి అనుగుణంగా కార్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని కొనసాగిస్తున్నట్టు ఎంఎస్‌ఐ  సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) ఆర్‌ఎస్‌ కల్సి తెలిపారు. జూన్‌-జూలై నెలల్లో కలిపి వాహనాల అమ్మకాలు 17 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయని ఆయన చెప్పారు.

Latest Videos

కేంద్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించడం కూడా ఈ వృద్ది రేటుకు కారణమని ఆయన తెలిపారు. గ్రామాల్లో పండించిన పంటకు మంచి ధర రావడంతో రైతుల కొనుగోలు సామర్థ్యం పెరిగిందని తెలిపారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో మంచి పేరున్న మారుతి వాహనాలపై వారు మక్కువ చూపడం వల్ల ఈ వృద్దిరేటు సాధ్యమైందని కల్సి అన్నారు.

ఇక భవిష్యత్ లో ఇంతకంటే మంచి ఫలితాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్షాలు మెరుగ్గా ఉండటంతో పంటలు బాగా పండి రైతుల కొనుగోలు సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. అలాగే వివిధ పంటలకు మద్దతు ధరలు పెంచడంతో వచ్చే పండగల సీజన్‌లో కార్లకు మంచి డిమాండ్‌ ఏర్పడుతుందని భావిస్తున్నామన్నట్లు కల్సి వివరించారు. 
 
click me!