మారుతి సుజుకి ఆల్టో కె10 కొత్త జనరేషన్ మోడల్‌.. అదిరిపోయే లుక్, డిజైన్ తో వచ్చే నెలలో లాంచ్.. ?

By asianet news telugu  |  First Published Jul 22, 2022, 3:44 PM IST

మారుతి సుజుకి వచ్చే నెలలో కొత్త ఆల్టో మోడల్‌ లాంచ్‌ చేయనున్నట్లు కనిపిస్తోంది. ఈసారి మార్కెట్లోకి సరికొత్త రూపంలో ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ను సిద్ధం చేస్తున్నారు.


మారుతి సుజుకి వచ్చే నెలలో కొత్త ఆల్టో మోడల్‌ లాంచ్‌ చేయనున్నట్లు కనిపిస్తోంది. ఈసారి సరికొత్త లుక్ లో ఆల్టో (alto) హ్యాచ్‌బ్యాక్‌ను సిద్ధం చేస్తుంది. మారుతి సుజుకి కొత్త జనరేషన్ ఆల్టోను విడుదల చేయడానికి సిద్ధమైంది, దీనిని మారుతి సుజుకి అరేనా బ్రాండ్‌తో విక్రయించనుంది. కంపెనీ ఇప్పటికే ఉన్న K10 అండ్ 800cc ఆల్టో మోడళ్లను నిలిపివేసింది, దీంతో కొత్త జనరేషన్ మోడల్ ఆల్టో  లాంచ్ కోసం మారుతి సుజుకికి లైన్ క్లియర్ చేసింది.

మారుతి ఆల్టో  K10 అండ్ 800cc రెండు మోడళ్లను విడుదల చేయనుంది. అయితే మారుతి ఈ రెండు మోడళ్లను కలిపి విడుదల చేస్తుందా లేదా విడివిడిగా విడుదల చేస్తుందా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ కొత్త కార్లలో కూడా మారుతి కొత్త జనరేషన్ సెలెరియో, వ్యాగన్ఆర్ అండ్ ఎస్-ప్రెస్సో వంటి అరేనా మోడల్‌లోని ఇతర కార్లలో ఉపయోగించిన ఆదే ఇంజన్‌ను అందించవచ్చు. 

Latest Videos

undefined

లుక్ అండ్ డిజైన్ గురించి మాట్లాడితే మారుతి కొత్త జనరేషన్ ఆల్టోలో కొన్ని మార్పులు చేయవచ్చు. కొత్త ఆల్టో  కమర్షియల్ షూట్ సందర్భంగా వెలువడిన స్పై ఫోటోల నుండి ఇప్పటికే వెల్లడైంది. జనాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కొత్త సెలెరియో డిజైన్ ద్వారా కొద్దిగా ప్రభావితమవుతుంది. కొత్త ఆల్టో మరింత గుండ్రని డిజైన్ లాంగ్వేజ్ సెలెరియో  చిన్న వెర్షన్‌గా ఉన్నట్లు వెనుక స్పై షాట్‌లు వెల్లడిస్తున్నాయి. 

కొత్త జనరేషన్ ఆల్టోలో స్టీల్ వీల్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ ఇంకా స్పై షాట్‌లతో పాటు బ్లాక్ ORVMలు లభిస్తాయి. మారుతి కొత్త కలర్ షేడ్‌ని కూడా ప్రవేశపెట్టవచ్చు. బహుశా సెలెరియోలో కనిపించే కలర్స్ కొత్త ఆల్టోలో కూడా కనిపిస్తాయి.

కొత్త జనరేషన్ మారుతి సుజుకి ఆల్టో 800సీసీ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సెలెరియోలో ఉపయోగించిన 1.0-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ యూనిట్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో  ఈ చిన్న ఇంజన్ గరిష్టంగా 47 bhp శక్తిని, 69 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కొత్త K10C ఇంజిన్ గరిష్టంగా 66 bhp శక్తిని, 89 Nm గరిష్ట టార్క్‌ను పొందుతుంది. కొత్త ఆల్టో కె10 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా పొందుతుంది. అయితే, ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా చూడవచ్చు. కొత్త తరం ఆల్టో  CNG వెర్షన్ కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది.
 

click me!