బి‌ఎం‌డబల్యూ 5 సిరీస్ : ఇండియాలోకి స్పెషల్ ఎడిషన్ కారు.. కేవలం 10 యూనిట్లను మాత్రమే..

By asianet news telugu  |  First Published Jul 22, 2022, 11:51 AM IST

BMW 5 సిరీస్ '50 జహ్రే M ఎడిషన్' మోడల్ ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీ పొందింది. ఈ కారు 2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 252 hp, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.1 సెకండ్లలో 0-100 kmph స్పీడ్ అందుకుంటుంది. 


బి‌ఎం‌డబల్యూ ఇండియా (BMW india) బి‌ఎం‌డబల్యూ ఎం GmbH (BMW M GmbH) 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియాలో రూ. 67.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో 5 సిరీస్ 50 జహ్రే ఎం ఎడిషన్ (50 Jahre M edition) కారును లాంచ్ చేసింది. BMW 530i M స్పోర్ట్ 50 జహ్రే M ఎడిషన్ (BMW 530i M sport 50 Jahre M ఎడిషన్) పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారుని కంపెనీ చెన్నై ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేయనుంది. కంపెనీ ఈ ప్రత్యేకమైన మోడల్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఈ కారుని కేవలం 10 యూనిట్లు మాత్రమే విక్రయించనుంది. 

ఇంజిన్ అండ్ స్పీడ్
BMW 5 సిరీస్ '50 జహ్రే M ఎడిషన్' మోడల్ ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీ పొందింది. ఈ కారు 2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 252 hp, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.1 సెకండ్లలో 0-100 kmph స్పీడ్ అందుకుంటుంది. 

Latest Videos

undefined

లుక్ అండ్ డిజైన్
ఎక్ట్సీరియర్ లుక్స్ పరంగా BMW 5 సిరీస్ '50 Jahre M ఎడిషన్' ఆల్-బ్లాక్ కిడ్నీ గ్రిల్ మరియు అల్లాయ్ వీల్స్‌తో స్పోర్టియర్ డిజైన్‌ను పొందింది. కిడ్నీ గ్రిల్ పైన '50 ఇయర్స్ ఆఫ్ M' డోర్ ప్రొజెక్టర్‌తో ఐకానిక్ M గుర్తు ఉంటుంది. ఇవి రేసింగ్ టచ్‌తో కూడిన క్లాసిక్ 'BMW మోటార్‌స్పోర్ట్' లోగో నుండి ప్రేరణ పొందాయి. M చిహ్నం వాహనం ముందు ఇంకా వెనుక లోగోలు అలాగే వీల్ హబ్ క్యాప్‌పై ఇచ్చారు.

BMW లేజర్‌లైట్ 650 మీటర్ల వరకు ప్రకాశిస్తుంది. M లైట్స్ షాడోలైన్ దీనికి మరింత శక్తిని జోడిస్తుంది, ఈ హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ ముదురు రంగును అందిస్తుంది. ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లు కారు  సైడ్ ప్రొఫైల్‌ను చాలా స్లిక్, డైనమిక్‌గా చేస్తాయి. వెనుకవైపు టెయిల్‌లైట్ నుండి త్రీ డైమెషియల్ రూపంలో కొత్త L-ఆకారపు లైట్ గ్రాఫిక్ ఉంది. 

ఇంటీరియర్ 
ఇంటీరియర్ విషయానికి వస్తే BMW 5 సిరీస్ '50 Jahre M ఎడిషన్' డ్రైవింగ్ సరైన వాతావరణాన్ని అందించే డ్రైవర్-సెంట్రిక్ కాక్‌పిట్‌ ఉంది. స్టీరింగ్ వీల్‌పై లెదర్ కవర్ అండ్ స్పెషల్ ట్రిమ్ స్ట్రిప్స్ కూడా వాహనం  స్పోర్టీ అనుభూతిని పెంచుతాయి.

గొప్ప ఫీచర్స్ 
BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్‌ BMW ఆపరేటింగ్ సిస్టమ్ 7.0, 3D నావిగేషన్, 12.3-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల కంట్రోల్ డిస్‌ప్లే అండ్ BMW వర్చువల్ అసిస్టెంట్ పొందుతుంది. BMW గెశ్చర్ కంట్రోల్ వాహనం మల్టీ ఫంక్షన్ల కోసం 6 ప్రీ డిఫైనేడ్ హ్యాండ్ మూవ్మెంట్స్ గుర్తిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వూఫర్ అండ్ BMW డిస్‌ప్లేతో కూడిన 16-స్పీకర్ సిస్టమ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

click me!