సరికొత్త హంగులతో మారుతి సుజికి సియాజ్, కేవలం రూ.11 వేలకే...

 |  First Published Aug 9, 2018, 4:54 PM IST

మారుతి సుజికి సరికొత్త మెరుగులతో సియాజ్ 2018 మోడల్ విడుదలకు సర్వం సిద్దం చేసింది. ఈ నెల 20న ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకోసం రేపటి నుండి (ఆగస్ట్ 10వ తేదీ) బుకింగ్స్ ప్రారంభించబోతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

మారుతీ సుజుకి సియాజ్ మోడల్ నాలుగేళ్ల క్రితం భారత మార్కెట్లోకి విడుదలైంది. మొదట్లో ఈ కార్ల అమ్మకాలు జోరుగా సాగినా, గత కొంత కాలంగా భారీగాపడిపోయాయి. దీంతో మళ్లీ ఆ మోడల్ కార్ల అమ్మకాల్లో పూర్వవైభవాన్ని తీసుకురాడానికి సరికొత్త స్టైల్లో కొత్త మోడల్ ని విడుదల చేస్తోంది.   

Latest Videos

ఈ సియాజ్ కారును మారుతి సుజుకి ఇండియా నెక్సా నెట్ వర్క్ నుండి మాత్రమే పొందాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 319 నెక్సా షోరూంల నుండి బుకింగ్ చేసుకోవడం ద్వారా, నెక్సా వెబ్ సైట్ నుండి ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారా దీన్ని పొందవచ్చు. కేవలం రూ. 11 వేలు చెల్లించి సియాజ్ ను బుక్ చేసుకోవచ్చని మారుతి సుజుకి తెలిపింది. 

 మారుతి సియాజ్‌ నెక్సా బ్లూ, మెటాలిక్‌ సిల్కీ సిల్వర్‌ కలర్స్‌తో పాటు మరికొన్ని రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఇంకా దీనిలో  ఫ్రంట్‌ లుక్స్‌ మార్చడంతో పాటు ఇంజన్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.  ఇంటీరియల్ గా కూడా వినియోగదారులను ఆకట్టునేలా మార్పులు చేసి విడుదలకు సిద్దం చేసినట్లు మారుతి సుజుకి సంస్థ తెలిపింది. దీని ప్రారంభ ధర రూ.7.8 లక్షలుగా (ఎక్స్ షోరూం ధర) నిర్ణయించారు.

click me!