అమరావతి రోడ్లపై ఇక ఎలక్ట్రిక్ కార్ల పరుగు, ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Published : Aug 09, 2018, 12:50 PM ISTUpdated : Aug 09, 2018, 01:00 PM IST
అమరావతి రోడ్లపై ఇక ఎలక్ట్రిక్ కార్ల పరుగు, ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఆధునిక హంగులతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు అనుగుణంగా ప్రతి విషయంలో ఆధునికత ఉట్టిపడటంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(బ్యాటరీ సాయంతో నడిచే)ను అమరావతిలో ప్రారంభించారు. ఇలాంటి పనులను ప్రోత్సహించడానికి ఏపి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ పర్యటకాభివృద్ది సంస్థ, మహింద్రా ఎలక్ట్రిక్, జూమ్ కార్ సంయుక్తంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లను అమరావతిలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్లు ప్రస్తుతం రాజధానిలో మాత్రమే అందుబాటులో ఉంటాయని, త్వరలోనే వీటిని మిగతా నగరాల్లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందిచడంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఈ ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో అమరావతిలో కాలుష్యం తగ్గించడానికి ప్రయత్నించి, మెరుగైన జీవన పరిస్థితులను కల్పిస్తున్నామన్నారు. 

ఇప్పటికే ఈ  జూమ్ కార్లు పూనే, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, జైపూర్‌,  మైసూర్‌, హైదరాబాద్‌లలో విజయవంగంగా నడుస్తున్నట్లు తెలిపారు. వినూత్న ఆలోచనతో ఎవరు ముందుకొచ్చినా ఏపి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. అందుకు ఇదే ఉధాహరణ అని చంద్రబాబు తెలిపారు.

ఈ బ్యాటరీ అద్దె కార్లను గన్నవరం విమానాశ్రయం, బెంజ్‌సర్కిల్‌, సచివాలయం వద్ద అందుబాటులో ఉంచినట్లు పర్యాటక శాఖ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు.  ఈ కార్లను అద్దెకు తీసుకుని స్వయంగా డ్రైవింగ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 15 వాహనాలను ప్రవేశపెట్టామని త్వరలో మరిన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడటానికే ఈ ప్రయత్నమని ఆయన తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి
Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్